ధర్మ, కర్మ సిద్దాంతాల మాటున, మానవులు సంభాషించుకోవడానికి కనిపెట్టబడ్డ భాషని మంత్రాలు, తంత్రాలుగా మార్చి, శ్రమతొ ప్రకృతిని, పదార్దాన్ని మార్చె ప్రక్రియని అసహ్యమైనదిగ, తోటి మానవుణ్ణి అంటరానివారిగా, గుణం తక్కువ వారిగా, శూద్రునిగా, పందిని దేవుడి అవతార రూపంగా వర్ణిస్తూ వేదాల పేరుతో వ్రాసిన త్రివర్గ సిద్దాంత రెండు కోట్ల స్లోకాలు, దేవుళ్ళను 3339 (రిగ్వేదం 3.9.11) వర్గాలుగా, భారతదేశ ప్రజలను 3000 కులాలకు పైగా విడగొట్టి, దేవుడి పేరు చెప్పి ఆచారాల పేరుతో ప్రజలు త్రివర్గ సిద్దాంతాన్ని పాటించదానికి ఒక పురోహిత వర్గాన్ని ఏర్పరచుకొని, ఇప్పటికీ తొంబై శాతంగా వున్న శూద్ర, అంటరాని ప్రజలు తమ కులం చెప్పుకొవడానికి కూడ సిగ్గుపడెల, అత్మన్యూనతా భావాన్ని, భయాన్ని కలగజేసె ప్రపంచంలొ ఎక్కడా లేని ఒక మానసిక రుగ్మత సిద్దాంతo వర్ణ వ్యవస్తకు మూలమైన ఇండో-ఆర్యన్ ల మాతృభూమిని గుర్తించడం, ఆర్యన్ ల దండయాత్రకు సంబందించి, ప్రపంచంలోని వివిద దేశాలలోని ప్రముఖ యూనివర్సిటీల ఆర్కియాలజిస్టులు, భాశాశాస్త్రవేత్తలు, మానవశాస్త్రవేత్తలు, చరిత్ర కారులు, ఫిలాలజిస్టులు, అన్ని రకాల స్ఖాలర్స్, గత రెండు వందల సంవత్సరాలుగ ఎన్నో త్రవ్వకాలు జరిపి, ఎంతో రీసర్చ్ చేసి, ఎంతో శ్రమించి, ఎన్నో విషయాలను బహిర్గతం చేసారు.
శూద్రులు చదవితె నాలుకలు కోసి, వింటె చెవులల్లో సీసం పోసిన, ఈ ఆర్యుల గురంచి తెలియ చెప్పే వేదాల లోని ఉపనిశత్తులు మొదటిసారి షాజాహాన్ పెద్ద కొడుకు దారా షుఖ్, 1657 లో సంస్క్రుతం నుండి పర్శియన్ భాషలోకి తర్జుమా చేశాడు.
మాక్స్ ముల్లర్ (1823 – 1900) ప్రముఖ జర్మనీ ఫిలాలజిస్ట్ మరియు ఓరియాంటలిస్ట్, ఇతను వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిశత్తులు మొట్టమొదటి సారి “సేక్రెడ్ బుక్స్ ఒఫ్ ది ఈస్ట్” పేరుతో ఇంగ్లీషు లొకి 1869 లో తర్జుమా చేసిన మేదావి. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు వేదాల మీద రీసర్చ్ చేయడానికి కారకుడు, ప్రపంచ వ్యాప్తంగ ఇండో-ఆర్యన్ సమస్య మీద రీసర్చ్ చేసే స్కాలర్స్ కి హీరో.
జార్జిస్ డూంజెల్ (1898-1986), ప్రముఖ ఫిలాలజిస్టు, పారిస్ యూనివర్సిటి లొ ప్రొఫెసర్ గా సంస్కౄతం తో పాటు 200 ప్రాచీన భాషలు అనర్గళంగ నేర్చుకొని, వేదాలను వడపోసి తన జీవిత కాలం అంతా ఇండో-యూరొపియన్ (ఆర్యన్) సమస్య మీద రీసర్చ్ చేసి, 1929 లో మొట్టమొదటి సారి వేదాలలో వున్న త్రివర్గ సిద్దాంతాన్ని తన ఫ్లామెన్-బ్రాహ్మణ్ పుస్తకం ద్వారా బహిర్గతం చేసాడు. తరువాత మరో పుస్తకం మిత్ర-వరుణ లో సంస్కౄతం – అవెస్తన్ (ఇరానియన్ ల ప్రాచీన భాష) సంభందాన్ని వివరంగా వ్రాసాడు.
ఇంకోవైపు ఆర్కియాలజిస్టులు 1920 నుండి జరుపుతున్న త్రవ్వకాలల్లొ సిందూ నాగరికతకు సంభందించి మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇలా 1,50,000 ఎకరాల వైశాల్యంలో డోళవీర, హరప్ప, రాఖీగడీ లాంటి నగరాలు, 2000 పట్టణాలు, అద్బుతమైన, అత్యంత సాంకేతిక పరిగ్ణానంతో విలసిల్లిన పట్టణ నాగరికతను బహిర్గతం చేశారు.
ఇలా వందలాది మంది వివిద దేశాలలోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రీసర్చి స్కాలర్లు ఈ సమస్య మీద రీసర్చ్ చేసి, కొన్ని వందల పుస్తకాలు వ్రాసారు. మన భారతదేశం లొ ఇలా ఇండో-ఆర్యన్ సమస్య మీద తమ జీవిత కాలం రీసర్చ్ చేసిన వాళ్ళలో ప్రముఖ హిస్టారియణ్ రొమిల్లా తాపర్, ఆర్ యస్ శర్మా, డి డి కోశంభి ప్రముఖులు.
ఈ పరిణామాలన్ని సహజంగానే వర్ణ వ్యవస్త ద్వారా పొందిన ఆదిపత్యాన్ని చలాయిస్తూ, గాయత్రీ మంత్రం ద్వారా మేదావిత్వం పొంది, అమెరికాలో నివసిస్తున్న బ్రాహ్మణ మేదావులకు, వేద వాణ్మయం ద్వారా రిజర్వేషన్ పొంది, జనాభా ప్రాతిపదికగ, రాజ్యాంగం ద్వారా, చట్టం ద్వారా రిజర్వేషన్ పొందిన S.C, S.T, B.C లను ప్రతిభ లేదంటూ (ప్రస్తుతం ప్రపంచ వ్యాప్టంగ వేలాది మంది S.C, S.T, B.C లు అమెరికా మరియు ప్రపంచం లోని ఎన్నో యూనివర్సిటీలల్లో చడువుతున్నారు, ఏ యూనివర్సిటీ కూడా ప్రతిభ లేదని చెప్పలేదు), IIT, IIM, AIMS ల దరిదాపుల్లోకి రాకుండా చేస్తు, త్రివర్గ సిదాంతాన్ని మనసా, వాచా, కర్మణా పాటిస్తున్న భారతీయ బ్రాహ్మణ, క్షత్రీయ మేదావులకు తమ కాలికింద భూమి కదిలిపొయినట్లయినది.
దీని పర్యవసానమే ఆర్యన్ దండయాత్రను వ్యతిరేకించే సిద్దాంతాలు. ప్రపంచంలోని దాదాపు పది ప్రసిద్ద యూనివర్సిటీలల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా వుంటూ, ప్రపంచంలొనే అరుదైన మేదావుల్లో ఒకరైన, అకాడమిక్ అవార్డులు తప్ప, మిగితా ఎలాంటి అవార్డ్ లు తీసుకొనని, రెండు సార్లు పద్మభూషణ్ అవార్డ్ ని నిరాకరించిన ప్రముఖ హిస్టారియన్ రొమిల్లా తాపర్ (81) కి అత్యంత ప్రతిష్టాత్మకమైన “లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ క్లూగ్ చైర్” కి అపాయిమెంట్ కాకుండా, ఈ వర్ణ మేదావులు దాదాపు 2000 సంతకాలు సేకరించి అడ్డుపడ్డ ఘనాపాటీలు. (ఆమె అపాయిమెంట్ అయ్యింది, అది వేరే విషయం).
ఆర్యన్ దండయాత్రను వ్యతిరేకించే, శ్రీకాంత్ తలగిరి లాంటి ఈ వర్ణ, త్రివర్గ సిద్దాంతకారులు ఎవ్వరూ యూనివర్సిటీలల్లో రీసర్చ్ చేసి ఆదారాలు చూపిస్తూ తమ వ్యాసాలు వ్రాసిన వాళ్ళు కాదు. (శ్రీకాంత్ తలగిరి కి ప్రొ. మైఖేల్ విట్జల్ హర్వార్డ్ యూనివర్సిటీ, అమెరికా లొ పిహెచ్.డి చేసి, తన సిద్దాంతాన్ని నిరూపించమని అవకాశం ఇచ్చాడు, కాని శ్రీకాంత్ తలగిరి నిజాలు వొప్పుకొవలసి వస్తదని నిరాకరించాడు), ఈ త్రివర్గ సిద్దాంతకారులు కేవలం తమ వాద పటిమతో, అబద్దాలతో, ఎలాంటి రీసర్చ్ మరియు క్రియేటివిటి అవసరం లేని వేద పాండిత్యం తో మాటల గారడి చేస్తూ, సామాజిక శ్యాస్త్రానికే మచ్చ తెస్తున్నరు. దీంట్లో మరో ట్విస్ట్ ఎమిటంటే, బ్రాహ్మణ సిద్దాంత కారులు, తమ వారి కోసం, ప్రపంచ వ్యాప్తంగ ఇండస్ హెరిటేజె, ఇండొ-అర్యన్ మీద జరుగుతున్న రీసర్చ్ ని, పదుల పేజీలల్లొ వివరముగ వివరిస్తు, తమ వెబ్ సైట్లలల్లో, క్రిస్టియన్ తెల్ల వాళ్ళు హిందూ మతం పై దాడి చెస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
సి.బి.ఎస్. వెంకటరమణ అన్నట్లు ముఖ్యంగా అతి ప్రాచీన కాలంలో, మానవ సమూహాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళటం సామాన్యమైన విషయమేనని చెప్పాలి. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటె, గ్రీకులు మరియు స్కాండినేవియన్లు వంటి అనేక ఇతర ఇండో యూరోపియన్ సంస్కృత ప్రజలు కూడ, తమ మాతౄ ప్రాంతాల సమాచారాన్ని కాపాడుకొలెదు. కాని వారు వలస వచ్చిన విశయం తెలుసు. ఒక చారిత్రాత్మక సంఘటన కాలం గడిచే కారణంగా ప్రజల సామూహిక చైతన్యాన్ని నుండి పోతుంది, కాని అది సంఘటన జరిగలేదని ఎప్పటికీ సూచించదు.
ఈ ఆర్యన్ దండయాత్రకు సంబందించి, ఇండో-ఆర్యన్ ల మాతృభూమికి సంబందించి ప్రపంచంలోని వివిద యూనివర్సిటీలల్లో ప్రొఫెసర్లు కనిపెట్టిన ఆదారాలేమిటో ఇప్పుడు చూద్దాం. 1. DNA ఆదారం 2. సంస్కృత గ్రంథాలు ఉపఖండంలోని, వాయువ్య (నార్త్ వెస్ట్, పాకిస్తాన్) నుండి తూర్పు కు, దక్షిణానికి విస్తరించడం 3. లా ఆఫ్ పాలటల్స్ (భాషా ఫార్ములా), మరియు హిత్తైతి సామ్రాజ్యం డిస్కవరీ 4. భారతదేశం మూలవాసుల ద్రవీడియన్ భాషకు, ఇండో-ఆర్యన్ ల సంస్కృత భాషల మూలం పూర్తిగా విభిన్నమని అలెగ్జాండర్ కాంప్బెల్, 1849 లో కనిపెట్టడం 5. ఇప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో, సిందూ నది ఆవలివైపు, ద్రవీడియన్ భాష బ్రూహి మాట్లాడె చాలా మంది ప్రజలు ఉండడం. 6. లక్శ్యద్యీపం లాంటి, దీవులు, చుట్టూ నీరు ఉండి, ఆర్యన్ దండయాత్రకు గురికాకుండా ద్రవీడియన్ భాష బ్రూహి మాట్లాడె ప్రజలుగా ఉండడం 7. ఇండో-ఆర్యన్ ల సంస్కృత గ్రంథాల్లో పూర్తిగా విభిన్నమైన ఇండియన్ మూలవాసుల ద్రవీడియన్, ముండారి పదాలే కాకుండా మరో ప్రాచీన ఆర్యులకి పూర్వం భాష పదాలు కలిగి ఉండడం 8. పర భాష పదాలు, వీరి మొదటి గ్రందం రుగ్వేదం, లొ కంటే తరువాత వ్రాసిన సంస్కృత గ్రంథాల్లో ఎక్కువ ఉండడం 9. సంస్కృత గ్రంథాల్లో ఇండో-ఇరానియన్ భాషలో చెట్ల పేర్లు కలిగి ఉండడం 10. ఉత్తర భారతదేశం లో స్థలం పేర్లు మరియు నదుల పేర్లు దాదాపు అన్ని ఇండో ఆర్యన్ సంస్కృతం భాష లో ఉండడం 11. భాషా పాలైంటాలజీ – వృక్షజాలం మరియు జంతుజాలం 12. గుర్రం పదాల ఆధారం 13. ఆక్లాండ్ విశ్వవిద్యాలయం న్యూ జేఅలాండ్, ప్రముఖ శాస్త్రజ్ఞులు క్వెంటిన్ డి. అత్కిన్సన్, సైన్స్ పత్రిక లో ప్రచురించిన అధ్యయనం ఇండో యూరోపియన్, ఇండో ఇరానియన్ భాషలు టర్కీ లోని అనటోలియా లో పుట్టిన భాషగా నిరూపించాడు 14. ఇండో యూరోపియన్ సంస్కృత భాష సెమిటిక్ అరువు పదాలు : నికోలస్ మోడల్ 15. ఫిన్నో ఉగ్రిక్ భాషాలో ఇండో ఇరానియన్, ఇరాన్, లేదా ఇండో ఆర్యన్ అరువుపదాలు 16. హర్మట్ట భాషాలో ఇండో ఇరానియన్, ఇరాన్, లేదా ఇండో ఆర్యన్ అరువుపదాలు 17. అవెస్తన్ .. ఇరానియన్ జురాస్ట్రియన్ సంప్రదాయం యొక్క పురాతన గ్రంధం మరియు రుగ్వెదం భాషాపరంగా మరియు సాంస్కృతికంగా చాలా దగ్గరగా ఉండడం 18. మిటాన్నీ ఒప్పందాలు – పురావస్తు మరియు భాషా శాస్త్రం స్పష్టమైన సూచనగా, క్రీ.పూ పద్నాలుగో శతాబ్దం లో ఇరాన్ తూర్పు ప్రాంతం అంతటా ఆర్యుల ఉనికిని చూపిస్తూ శాసన నిదర్శనం ఉంది. 19. సింధూ నాగరికత అర్కియాలజి 20. మొహెంజో-దారో నగరంలో కీలకమైన వివిధ ప్రాంతాల్లో ముప్పై ఏడు అస్థిపంజరాలు కనుగొనడం, వీటిలో అర డజను అస్థిపంజరాలు ఒకే రొడ్డుపైన డొరకడం, రుగ్వేదం లొ ఇంద్రుడు, పురం దరుడు (కోటలను కూల్చినవాడు) గ చెప్పడం ఆధారంగా వీలర్ గొప్ప నాగరికత యొక్క మరణానికి వెనుక ప్రధాన కారకుడు ఇంద్రుడు గ చెప్పడం 21. భారత పురావస్తు శాఖ ఎండిపోయిన ఘగ్గర్ నది ఒడ్డున కాలీబంగన్ సైట్ వద్ద త్రవ్వకాలు ఫలితంగా ఇండో ఆర్యన్ సాంస్కృతిక జాడలను కనిపెట్టడం. 22. ఇరాన్ లోని మిట్టాని రాజ్యం తేదీ, తరువాత వేద గ్రంధాలలో ఇనుము ప్రస్తావనలు రుగ్వేదం యొక్క కూర్పు తేదీని కనొక్కోడానికి సహాయపడుతుంది.
ఇలా ఇంకో వంద కంటె ఎక్కువనే ఆధారాలు చెప్పవచ్చు. అమెరికా లోని సాల్ట్ లేక్ సిటి, గవర్నర్ ఆఫీస్ లో, శ్రీ లంక అంబాసిడర్ పాలిత కోహన, తమిళ సమస్య మీద ప్రశ్నలకు సమాధనమిస్తూ, నేను మరియు మరో DNA కంపెనీ ఓనర్ ఆర్యన్ దండయాత్ర మరియు ఇండో-యూరోపియన్ భాష అయిన సింహళ భాష గురించి అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తూ, క్రీ. పూ 500 సం.లో అర్యన్ లు శ్రీలంకలో అడుగుపెట్టినట్లు ఒప్పుకున్నాడు. అంటె భారతీయ ఉపఖండంలో, పాకిస్టాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు, ఆర్యన్ దండయాత్రని ఆమోదించినయ్, ఒక్క బ్రాహ్మణ అదిపత్య భారతదేశం లో మాత్రమే, వర్ణ మేదావులు అమోదించట్లేదు.
డి యన్ ఎ రిపోర్ట్: పరిశోధకులు, ఉటా విశ్వవిద్యాలయం నుండి మైఖేల్ బాంశడ్, మరియు WS వాట్కిన్స్ భారతదేశం లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి బిబి రావు, బివిఆర్ ప్రసాద్, జెయమ్ నాయుడు లు తమ విశ్లేషణకు జన్యువుల రెండు సెట్లను ఉపయోగించారు. ఒక సెట్, స్త్రీ వారసత్వం కనుగొనడానికి మైటోకాండ్రియ నుండి మాతృ వారసత్వం దాగి జన్యువులు, రెండో సెట్ పురుషుడు వారసత్వం కనుగొనడానికి వై (క్రోమోజోమ్) జన్యువులు పరిశీలించారు, కేవలం కొందరి అగ్రవర్ణాలలోని పురుషుల జన్యువులు మాత్రమే ఇండో యూరోపియన్ ప్రజల జన్యువులతో పోలివున్నయ్, స్త్రీలు ఈదేశ మూల వాసులుగ గుర్తించారు. అంటే ఆర్యులు ఈదేశం మీద దాడి చేసి, మూలవాసుల స్త్రీలను కూడ ఆక్రమించినట్లు అర్దం అవుతుంది.
ఈ ఆర్యులు దేశదిమ్మర పశుపోశకులు కావడం చేత, సిందూ నాగరికుల్లా వీరికి స్థిరమైన పురావస్తు అవశేషాల ఆదారాలు లేకపొవడం వల్ల వీరి మాత్రుభూమిని కనిపెట్టడం కష్టం అయినప్పటికి, ఆర్కియాలజిస్టులు, భాశాశాస్త్రవేత్తలు, మానవశాస్త్రవేత్తలు, చరిత్ర కారులు, ఫిలాలజిస్టులు, అన్ని రకాల స్ఖాలర్స్ ఎంతో రీసర్చ్ చేసి, ఎంతో శ్రమించి, పైన పేర్కొన్న విషయాలను బహిర్గతం చేసారు.
మరో ముఖ్యవిషయం, మేదావులు, ప్రజలు గమనించవలసింది, ఆర్యుల ఆరంభ దశలోనే (క్రీ. పూ 1500 – 1100), ఆర్యుల ఇండో యూరోపియన్ త్రివర్గ సిద్దాంతం పటిష్టం అయ్యి, భారత సమాజం సామాజిక వర్ణాలు లేదా “కులాలు” గా ఏర్పడి, బ్రాహ్మణ మరియు రాజన్య రెండు ఉన్నత వర్ణాలు లేదా కులాలుగా యేర్పడ్డాయి. రిగ్వేదం లోని, 4.50.8 స్లోకం బ్రాహ్మన, రాజన్య మధ్య అన్యోన్యతని “యస్మిన్ బ్రహ్మ రజని పూర్వహ్ ఐతి” (ఆ రాజన్ ఇంట్లో బ్రాహ్మణ మొదటి స్థానంలో నడుస్తూ) అంటూ, రాజన్య, ప్రజల (విస్) మద్య సంభందాన్ని తస్మై విసః స్వయమ్ ఎవా నమన్తె (అతనికి (రాజన్య కి) ప్రజలు (విస్) స్వతాహాగ విధేయత కలిగి ఉంటారు) అంటూ చాల స్పష్టంగా చెప్పడం గమనించ వలసి ఉంది.
ఈ బ్రాహ్మణ మరియు రాజన్య మద్య అన్యోన్యత, మెకానిజం బ్రాహ్మణులు వ్రాసిన, తైత్రేయ సంహిత 2.4.13.1 స్లొకంలో, క్షత్రియుని యొక్క శక్తి బ్రాహ్మణ ఆగ్ణ ద్వారా మాత్రమే అనుమతించబడినట్లు, ఐతారేయ బ్రాహ్మణా పుస్తకంలోని స్లొకం 8.9 బ్రాహ్మణ పురోహితుడు కలిగి ఉన్న రాజు యొక్క, రాజ్యం తొందరగా ముగింపు దశకు రాదని, అతను (రాజు) పండిన వయస్సు వరకు జీవిస్తారని … ఇలా పదుల సంఖ్యలో స్లొకాలు వీరు వ్రాసిన పుస్తకాలల్లొ చూడవచ్చు.
మేము ముందటి అర్టికల్ లో దేవుళ్ళని మూడు వర్గాలుగా విడగొట్టి బ్రాహ్మణులకి అగ్ని దేవుణ్ణి రిజర్వ్ చేశారంటు చెప్పినట్లు, వీరి రుగ్వేదం లొని మొదటి స్లోకం .. “అగ్నిమీళె పురొహితం యగ్నాస్య” (నేను అగ్నిని కీర్తిస్తాను, ప్రత్యేక పూజారి, యగ్నం యొక్క మంత్రి …హోతారం పూజారి, గొప్ప సంపద ప్రదాత) .. అంటూ బ్రాహ్మణ దెవుడికి స్లోకం వ్రాస్తూ మొదలు పెడతారు. గ్రాస్మాన్ వారి ఇండెక్స్ లెక్సికాన్ ప్రకారం బ్రాహ్మణ అనె పదం రుగ్వేదం లో 240 సార్లు వస్తుంది.
సి.బి.ఎస్. వెంకటరమణ గారు “అంతేకాక, ‘మానవులందరూ సమానమే’ అనే నేటి సామాజిక-రాజకీయ ప్రాథమిక సూత్రం కేవలం గత వంద లేదా నూటయాభై సంవత్సరాల కాలం నుంచి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని, ఇప్పుడు మానవ సమాజం యావన్మందికీ అంగీకారమైంది. అంతకు ముందు, మానవ సమాజం ఆవిర్భవించినప్పటినుంచి కొన్ని వేల ఏళ్ళపాటు దాదాపు అన్ని మానవ సమూహాల్లోనూ, అనేక రకాలైన అసమానతలు ఉండేవి” అంటూ తమ తోటి మానవుణ్ణి అంటరానివారిగా, వ్రాతపుర్వకంగా, 90% మంది ప్రజలని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని శూద్రులుగా బానిసలుగా చిత్రీకరించడం సహజాతి సహజం అన్నట్లు మాట్లాడడం ఏ రకంగ సమంజసమో, ఆచరణీయమమో, శ్లాఘనీయమో తనే చెప్పాల. మరి ఈ వర్ణ మేదావులు కనీసం 150 సం.ల క్రితం అయినా, తమ త్రివర్గ సిద్దాతం తప్పు, మానవులందరూ సమానమే అని, గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తరవాత బైబిల్ లో భూమి గుండ్రంగా ఉందని మర్చుకున్నట్లు, మొత్తం విశ్వం యొక్క సృష్టికర్త మరియు రక్షకుడు అయిన దేవుడు 90% ప్రజలు బానిసత్వ తరగతి శూద్రులు, అంటరానివారు ఉండాలని కోరుకోడని, వేదాలను తిరిగి వ్రాసివుంటే బాగుండేది.
విశ్వం లొ వున్న ప్రతీ దాన్ని, ప్రకృతి, పశువులు, చెట్లు, మనుశులు, వేదాలు, సంశ్క్రుత భాష, మానవ శరీరం, ఇలా అన్ని మూడు వర్గాలుగ విడగొట్టి బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులకు రిజర్వేషన్ కల్పిస్తూ, బ్రాహ్మణుణ్ణి దేవుడిగా, ఆత్మగా చెప్పుతు, 90% మంది ప్రజలను శూద్రులుగా, అంటరానివారుగా అత్మన్యూనతా భావం లోకి నెట్టివేస్తున్న, సి.బి.ఎస్. వెంకటరమణ గారు చెప్పినట్లు వేల సం.ల క్రితం వ్రాసిన వేదాలని, సంకుచిత ఉద్దేశ్యాలు వదలిపెట్టి చరత్రని గౌరవిస్తూ మానవులందరూ సమానమే అని, వేదలల్లో వున్న త్రివర్గ సిద్దాంతాన్ని తెలుగు లోకి తర్జుమా చేసి ప్రజలకి వివరించడానికి, కులాలను ద్వంసం చేయడానికి కలసి రావల్సిందిగా వినమ్రంగా మనవి చెసుకుంటున్నాము
సత్య బత్తుల (USA)
డా. చక్రపాణి ఘంటా
డా. సత్యనారాయణ అడప
డా. భూక్య భాంగ్య
సుదర్శన్
కుమార స్వామి
www.indusheritagecenter.com
.
comment closed