మన హిందు సమాజం లోని కుల వ్యవస్థ కి మూలం బ్రాహ్మణిజం. ఈ వైదిక సంశ్క్రుతి(వర్ణ వ్యవస్థ) మన భారతదేశానికి సుమారు క్రీస్తుకు పుర్వం 1700 సం లొ ఇరాన్ లొని మిట్టాని రాజ్యం నుండి ఆర్యులు తీసుక వచ్చారు. వీరి బాష సంస్కృతం . ఇరాన్ ప్రజల ప్రాచీన బాష అవెస్తన్ (avestan) మరియు సంస్కృత బాషలు ఒకే రకముగ వుండడమె కాకుండా రుగ్వేదములొ వ్రాసిన ఇంద్ర, మిత్ర, వరుణ లాంటి దేవుళ్ళందరి పేర్లు వాటిలొ వున్నాయి. ఈ ఆర్యులు పషుపొషకులు (pastoralists) మరియు దేశ దిమ్మరులు (nomads).
ఈ ఆర్యులు భారతదేశానికి రాక పూర్వం భారతదేశం చరిత్రని పరిశీలిస్తె, అప్పటి ప్రాచీన సమకాలిన గొప్ప నగర సమాజాలు ఈజిప్ట్, మెసపటోమియ, చైనా ల కంటే ధీటుగ భారతదేశం హరప్పా, మొహంజదారొ, డోళవీర, లొథల్, రాఖిగఢి, గన్వెరివాల లాంటి నగరాలు, దాదాపు 2000 చిన్న పట్టణాలతొ క్రీస్తుకు పూర్వం 3000 సం ల నుండి క్రీస్తుకు పూర్వం 1700 సం ల వరకు దాదాపు 1300 సం లు సిందూ నది పరివాహక ప్రాంతములొ పట్టణ నగర (urbanized) నాగరిక సామ్రాజ్యము గ విలసిల్లింది
www.harappa.com వెబ్ సైటె లొ ఆర్కియాలజిస్టులు 1920 సం నుండి జరిపిన తవ్వకాల ఫొటొలను పరిశీళిస్తే మన భారతదేశం క్రీస్తుకు పూర్వం 2600 సం నాటికె (అంటె 4700 సంవత్సరాల క్రితం), ప్రతీ ఇల్లు ఇటుకలతొ కట్టబడి, బాత్రూం, లెట్రిన్, అండెర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్తతొ ప్రపంచ ప్రాచీన సమాజాలలొ, ప్రాచీన అమెరికా గా ప్రసిద్దికి ఎక్కింది. రైతులు, వ్రుత్తి పనివారు కుమ్మరులు, కమ్మరులు, చేనెతకారులు లాంటి వాళ్ళు కలసి వినూత్న పరికరాలు కనిపెట్టి, లిపి కలిగిన భాషతొ గొప్ప పట్టణ నగర నాగరిక సమాజాన్ని ఆవిష్కరించారు.
కాని దేశ దిమ్మరులైన ఆర్యుల దండయాత్రకి లొంగిపొయి ఒక గొప్ప పట్టణ నగర నాగరిక సమాజం అంతరించింది. భారతదేశం పట్టణ నగర (urbanized society) సమాజం నుండి పశుపొశన (pastoralist society) సమాజముగా మారిపొయింది. యూరప్ లో పట్టణ నగర (Urbanization) సమాజం తరువాత, పారిశ్రామిక విప్లవం (Industrial Revolution) వచ్చింది.
దెశదిమ్మర పశుకాపరులైన ఆర్యులు సిందూ ఉపనది అయిన సరస్వతి నది (క్రీస్తుకు పూర్వం 1300 సం లొ ఎండిపొయినది) ఒడ్డున చిన్న గూడాలను యేర్పరచుకున్నారు. అర్కియలజిస్టుల తవ్వకాలలొ ఆర్యులు పశుపొశన దెశదిమ్మరులు కావడం చేత వీరి సమాచారం తవ్వకలల్లొ బయట పడ్ద యగ్నానికి సంబందించిన పొయ్యిలు, తాళ పత్ర గ్రందాల మీద వ్రాసిన వీరి మొదటి గ్రందం రుగ్వేదం, వీరి చారిత్రక ఆధరాలు.
క్రీస్తుకు పూర్వం 1100 సం లొ రుగ్వేదాన్ని కంపోజ్ చేసినట్లు, క్రీస్తుకు పూర్వం 300 సం లొ సంశ్కృత భాషని దేవనగరి లిపిలొ వ్రాసినట్లు ఇండాలజిస్తులు నిర్డారించారు. తర్వాతి కాలములొ యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, ఉపనిషత్తులు, పురానాలు లాంటి ఎన్నొ గ్రందాలు సంశ్కృత భాషలొ వ్రాసారు.
ఈ వేదాలలొని శ్లొకాలని పరిశీలిస్తె, ఈ ఆర్యులు వర్గీకరణ (వర్ణ) వ్యవస్తని కనిపెట్టినట్లు, వీరి సిద్దాంతం ప్రకారం సమాజాన్ని త్రివర్గాలుగ (త్రివర్ణ), మతం (బ్రాహ్మణ), పాలన మరియు రక్షణ (క్షత్రీయ), ఉత్పాదకత (వైశ్య) లుగ విభజించినట్లు, అంతెకాకుండ ఈ వర్గీకరణ సిద్దాంతాన్ని వ్రాసిన, లేదా త్రివర్గ స్కీం ని ప్రవెశ పెట్టిన బ్రాహ్మణులు మిగిలిన వర్గాలు (వర్ణాల) కంటె, రాజు కంటె కూడ పై స్తాయిలొ తమకు తాము పెట్టుకున్నట్లు అర్దం అవుతుంది. బ్రాహ్మిన్, క్షత్రీయ, వైశ్యులు రెండవసారి జన్మించిన (జంజం రెండవ జన్మకి చిహ్నం), ఉపనయనం లేదా వొడుగు చెసిన పూర్తి ఆర్యన్ సభ్యులు. శూద్రులు మరియు అంటరాని వారికి వడుగు వుండదు.
రెడ్డి మరియు కమ్మ కులాలకి కూడ వడుగు వుండదు, వీరు కూడ సూద్ర కూలాలె. ప్రజాస్వామ్య సమాజం వీళ్ళను అగ్రవర్ణాలుగ గుర్తించింది కాని హిందు బ్రాహ్మనులు వీరిని క్షత్రీయులుగు గుర్తించలెదు.
ఆర్యులు సిందు నాగరికుల మీద దాడి చెసి, తమ త్రివర్గ (మూడు కాటగరి) స్కీం ని పెంచి (extended), ఓడిపొయిన భారతదేశ మూల వాసులైన సిందూ నాగరకత ప్రజలను “శూద్రులు” గా, నాలుగవ వర్గంగా ఇమిడ్చుకున్నారు. చరిత్రని ఇంకొంచం పరిశీలిస్తె క్రీస్తు శకం 320 – 520 సం లొ, గుప్తుల కాలములొ చతుర్వర్ణాన్ని ఐదుకి పెంచి (extended) పంచముడిని వైదిక వ్యవస్తలొకి ఇముడ్చుకున్నట్లు ఫాహియాన్ (చైనా బౌద్ద బిక్షువు కాలి నడకన చైన నుండి భారతదెశ బౌద్దారామాలు గుప్తుల కాలములొ సందర్శించాడు) వ్రాసిన పుస్తకాలు చెప్పుతాయి. ఉత్తర భారతదేశం నుండి, దక్షణ భారతదేశానికి ఈ ఆర్యన్ సంశ్కృతి(వర్ణ వ్యవస్థ) విస్తరించె క్రమములొ ఈవిదముగ వర్గీకరణ సిద్దాంతాన్ని పెంచుకుంటు, ఆరు, యెడు, యెనిమిది, ఇలా ఆర్యులు అందరిని వైదిక మతములొ కలుపుకున్నారు.
ఈ త్రివర్గ సిద్దాంతం (స్కీం), బ్రాహ్మణులు వ్రాసిన ఏ స్లొకంలొనైన చూడవచ్చు. ఇక్కడ తెలుగులోకి తర్జుమా చేసిన సత్పథ బ్రాహ్మణ పుస్తకములొని 4.4.1.15,16,18 స్లొకం చూద్దాం.. “పశువులకు వాయు (దేవుడు) నాయకుడు; వాయువు శ్వాస; జంతూవులు వాయువుతోనె సజీవులు. దేవుళ్ళ దగ్గర నుండి అతను (వాయు దెవుడు) పసువులను తోలుకొని పొయ్యాడు. దేవుళ్ళంత అతని కొసం ఉదయం సోమ యాగం సమయాన ప్రార్దన చేశారు, కాని అతను రాలెదు. వాళ్ళు మద్యాహ్న సొమ యాగ సమయాన ప్రార్దన చేశారు, కాని అతను రాలెదు. వాళ్ళు సాయంకాల సొమ యాగం సమయాన ప్రార్దన చెసారు …. ఒకవేళ అతను ఉదయం సొమ యాగ సమయములొ వచ్చివుంటె,పశువులు బ్రాహ్మణులతొ వుండేవి; ఉదయం సొమ యాగం కొసం గాయత్రి (మంత్రం); బ్రాహ్మణ (శక్తి)కి గాయత్రి (మంత్రం). మరియు ఇంద్రుడుకి సంబందించిన మధ్యహ్న సోమ యాగం సమయములొ అతను వచ్చి వుంటె, ఇంద్ర ది క్శత్ర (శక్తి). మరియు అతను సాయంత్ర సోమ యాగం సమయానికి వచ్చాడు కాబట్టి – “విశ్వ దేవుళ్ళు” కి సంబందించిన సాయంత్ర సోమ యాగం, మరియు ఇదంతా “విశ్వ దెవుళ్ళు” – అందుకె ప్రతీచొట పశువులు.
పైన పేర్కొన్న సృష్టి కథ స్లొకాన్ని పరిశీళిస్తె ఈ త్రివర్గ స్కీం చూడవచ్చు. సోమ యాగాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రా లుగ విభజించడం చూడవచ్చు మరియు “ఒకవేళ అతను ఉదయం సొమ యాగ సమయములొ వచ్చివుంటె,పశువులు బ్రాహ్మణులతొ వుండేవి; ఉదయం సొమ యాగం కొసం గాయత్రి (మంత్రం); బ్రాహ్మణ (శక్తి)కి గాయత్రి (మంత్రం)” అంటూ
ఉదయం (కాలం) = బ్రాహ్మణులు (సామజిక వర్గం)= గాయత్రి (మంత్రం)= బ్రాహ్మణ (శక్తి) చేసి, బ్రాహ్మణులకి ఉదయం, గాయత్రి మంత్రం, బ్రాహ్మణ శక్తిని రిజెర్వేషన్ చేసారు.
ఇక రెండవ కాటగిరి “మరియు ఇంద్రుడుకి సంబందించిన మధ్యహ్న సోమ యాగం సమయములొ అతను వచ్చి వుంటె, ఇంద్ర ది క్షత్ర (శక్తి).” ని చూస్తె
మధ్యాహ్నం (కాలం) = ఇంద్ర (దైవం) = క్షత్ర (శక్తి) = x (మంత్రం మిస్సింగ్) = x (సామాజిక వర్గం మిస్సింగ్) అంటూ, మొదటి బ్రాహ్మణ కాటగిరి లొ వ్రాసినట్లు ఇక్కడ మధ్యాహ్నం ఏ మంత్రం పఠిస్తారొ, ఏ సామాజిక వర్గమొ వ్రాయలెదు.
ఇక పూర్తి లెక్కలేకుండ వ్రాసిన మూడవ కాటగిరి “మరియు అతను సాయంత్ర సోమ యాగం సమయానికి వచ్చాడు కాబట్టి – “విశ్వ దేవుళ్ళు” కి సంబందించిన సాయంత్ర సోమ యాగం, మరియు ఇదంతా “విశ్వ దెవుళ్ళు” – అందుకె ప్రతీచొట పశువులు.” అంటూ ముగించాడు, ఇక్కడ సాయంత్రం (కాలం) = విశ్వ దెవుళ్ళు (దైవం) = పశువులు (అస్తిత్వం, పై రెండు కాటగిరీలల్లొ వ్రాయలెదు)= x (మంత్రం మిస్సింగ్) = x (సామాజిక వర్గం మిస్సింగ్)
మిస్సీంగ్ అయిన విశయాన్ని కి మరో త్రివర్గ శ్లోకం “జైమిన్య ఉపనిశత్ బ్రాహ్మణ 2.1.4.11-13″ పుస్తకం లొని స్లొకం చూద్దాం
“ప్రజాపతి “భు” అని దీన్ని (భూమి ని)శ్రుష్టించాడు, “భువ” అని వాతవరణాన్ని , “స్వహ్” అని ఆకాశాన్ని, ఇలా ముళ్ళోకాలు వున్నట్లు, ఇదంత వుంది … ప్రజాపతి “భు” అని బ్రాహ్మణున్ని శ్రుష్టించాడు, “భువహ్” అని క్షత్ర, “స్వహ్” అని విస్, ఇలా బ్రాహ్మణ, క్షత్ర, విస్ వున్నట్లు, ఇదంత వుంది … ప్రజాపతి “భు” అని అత్మ ని శ్రుష్టించాడు, “భువహ్” అని మనుశులను, “స్వహ్” అని పశువులను, ఇలా అత్మ, మనుశులు, పశువులు వున్నట్లు, ఇదంత వుంది”
మరొ స్లొకాన్ని రుగ్వేదం 10.90.11-12 నుండి చూద్దాం “పురుష ముఖం బ్రహ్మిణ్, భుజాలు క్షత్రీయ, తొడలు వైశ్య, పాదం శుద్ర” .. ఈ మూడు స్లొకాలని పరిశీలిస్తె
బ్రాహ్మిన్ (సామాజిక వర్గం) = ముఖం (శరీరం) = ఉదయం (కాలం) = x (దైవం మిస్సింగ్ = బ్రుహస్పతి) = గాయత్రి (మంత్రం) = బ్రాహ్మణ్ (శక్తి) = అత్మ (అస్తిత్వం) అని
క్షత్రియ (సామాజిక వర్గం) = భుజాలు (శరీరం) = మధ్యాహ్నం (కాలం) = ఇంద్ర (దైవం) = x (మంత్రం మిస్సింగ్ = త్రిస్తుభ్) = క్షత్ర (శక్తి) = మానవులు (అస్తిత్వం) …
ఇంక వైశ్య (సామాజిక వర్గం) = తొడలు (శరీరం) = సాయంత్రం (కాలం) = విస్వ దెవుళ్ళు (దైవం) = విస్ (శక్తి) = పశువులు (అస్తిత్వం)
మరో త్రివర్గ శ్లోకం సత్పథ బ్రాహ్మణ పుస్తకములొని 10.3.5.10 -11 … ఈ బ్రాహ్మణుడు అత్యంత ప్రతిభావంతుడు, ఇతనికి మించినది ఏదియును లేదు. ఇది అతనికి తెలుసు, అందుకే తన చుట్టూ వున్న వారి అందరిలొ గొప్పవాడిగ వుంటాడు. ఈ బ్రాహ్మనుడికి కి ముందు మరియు వెనుక ఎవరూ పొటీదారులు వుండరు. ఆతని వారసులు ఇంకా గొప్పవారు…
ఇలా బ్రాహ్మణులు వ్రాసిన అన్ని పుస్తకాలలొని శ్లొకాలల్లొ వున్న … వేద గ్నానం … సారంశం .. ఇదే .. విశ్వం లొ వున్న ప్రతీ దాన్ని, ప్రకృతి, పశువులు, చెట్లు, మనుశులు, వేదాలు, సంస్క్ర్ త భాష, మనవ శరీరం, ఇలా అన్ని మూడు వర్గాలుగ విడగొట్టడం .. ఆర్యన్ వర్గాలైన బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, మూడు వర్గాలకు రిజెర్వేషన్ చెయడం. వారి గురించి పొగుడు కోవడం … అంటె దెవుళ్ళని మూడు వర్గాలుగా విడగొత్తి, బ్రాహ్మణులకి అగ్ని, వాసు దెవుళ్ళని, క్షత్రీయులకి ఇంద్ర, వాయు, రుద్ర దెవుళ్ళని, వైశ్యులకి సూర్యా, వరుణ, అదిత్య దెవుళ్ళని రిజెర్వ్చెసారు … ఇలాగె పశువులు … మేక ని బ్రాహ్మణులకి, గుర్రం ని క్షత్రీయులకి, ఆవు ని వైశ్యులకి రిజర్వెశన్ చెసారు…
ఈ పుస్తకాలల్లో, వైశ్యులు పశువులకి శ్రుష్టి కర్తలుగ, బ్రాహ్మణ, క్షత్రీయులు మిగిలిన అన్ని జీవజాతుల శ్రుష్టి కర్తలుగ చెప్పుకున్నారు.
మన బ్రాహ్మణ దేవుడు “శూద్రులు” కి మానవ పాదలు, మరియు అర్యన్ మూడు వార్ణాలకి సేవ చేసె పవిత్ర కర్యక్రమాన్ని రిజర్వేషన్ చెసారు. పంచములకి ఏ రిజర్వేషన్ లేదు,వాళ్ళు అంటరాని వారు.
బ్రాహ్మణ, క్షత్రీయ, ప్రజల (విస్) సంబందం ఎలా వుండాలో సత్పథ బ్రాహ్మణ పుస్తకములొని 11.2.7.16 స్లొకం చూద్దాం … రెండవ కేక్ విస్ (ప్రజలు); మరియు, నిజానికి విస్ (ప్రజలు) రెండవ కేక్ అని ఎవరికి తెలుసో, వాళ్ళు (బ్రాహ్మణ, క్షత్రీయ)సురక్షితంగ, పరిపూర్నంగ తమ సుఖం కోసం వాడుకొవచ్చు. మరియు ప్రజలు దేన్ని సంపాదించుకుంటరొ అది అంతా వీళ్ళకు (బ్రాహ్మణ, క్షత్రీయ) చెందినదె.మరియు సాద్యమైనంత వరకు తక్కువ స్వరిత సమర్పణ కాబట్టి మొదటి కేక్ అగ్ని (బ్రాహ్మణ)కి సమర్పించాలి, అందువల్లనే బ్రాహ్మణ మరియు క్షత్రీయ యొక్క ఆదిపత్యం ప్రజల మీద స్థిరపడ్డాయి.
సిగ్గు, బిడియం వదలిపెట్టి వ్రాతపూర్వకముగ, తమ సుఖవంతమైన జీవితం సామన్య ప్రజలను దోచుకునె దాని మీద వున్నదని ఒప్పుకొవడమే కాకుండ, ” బ్రాహ్మణ మరియు క్షత్రీయ యొక్క ఆదిపత్యం ప్రజల మీద స్థిరపడ్డాయి” అని వ్రాసుకున్నారు …
ఈ గొప్ప వర్గీకరణ, రిజర్వేషన్ పుస్తకాలనె మంత్రాలు, తంత్రాలు గ, గ్నానము గ వ్రాసి, శ్రమతొ ప్రకృతిని, పదార్దాన్ని మార్చె ప్రక్రియని అసహ్యమైనదిగ,ఉత్పత్తి పరికరాలను కనిపెట్టడం అంటరానిదిగా మార్చి … పదం లేదా మంత్రం లేదా తంత్రం (ఒం, హ్రీం, క్లీం) తొ, ప్రక్రుతిని, పదార్దాన్ని మారుస్తానని … 2 కొట్ల స్లొకాలని … క్రీస్తుకు పూర్వం 1100 సం నుండి, ఇప్పటి వరకు వ్రాసుకుంటూ … ఈ వర్ణ శ్లొకాలను .. ప్రజలు పాటించదానికి ఒక పురోహిత వర్గాన్ని ఏర్పరచుకొని “ఇంతింతై వటుడింతై” అన్నట్లు .. ప్రపంచములొ ఎక్కడా లేని ఒక అనైతిక కులవ్య్వస్తని సృశ్థించారు.
గెలీలెయొ టెలిస్కోపె ని కనిపెట్టిన తరువాత, క్రిస్తియన్ మతం తన బైబిల్ లొ భూమి గుండ్రముగా వున్నదని మార్చు కున్నారు. అమెరికలొ పుట్టిన మార్మన్ మతం, యూటా రాష్త్రం కొసం, బహు భార్యత్వాన్ని నిషేదించి తన “బుక్ ఆఫ్ మార్మన్” ని మార్చుకుంది.
“Thinking is not biological, it’s one of the social gift” అని నిర్దారించ బడ్డ, ఈ సైంటిఫిక్ యుగములొ కూడ, ఈ అనాచా(ఆ)ర్యులు … దెవున్ని అడ్డం పెట్టుకొని వ్రాసిన వర్గీకరణ, రిజెర్వేషన్ వ్రాతలని మార్చుకుంటారని please don’t ever think. ఎందుకంటె వర్ణ వ్యవస్త అదిపత్యం కొసం యెర్పడ్డది, మతం కొసం కాదు.

comment closed