బ్రాహ్మణుడు మరియు బ్రహ్మ దేవుని పుట్టుక
రాజు లేదా రాచరికం (రాజ్యం) లేదా అదికారం యొక్క క్రూరత్వం మరియు కాటిన్యం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగ చరిత్రలో ప్రతీ రాజు రాజ్యాదికారం కోసం చాలా క్రూరంగ, నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా, అమానుషమైన హత్యలు, ఊహింపశక్యముగాన దురాగతాలు చేసినవాళ్ళే. కొందరు రాజులు ఉన్మాదం తో, వారి సోదరులు, సోదరీమణులు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, ప్రత్యర్థులును అదికారానికి అడ్డువచ్చిన వారు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా నరికివేసిన సంఘఠనలు కోకొల్లలు. వారి స్వంత పిల్లలను సహితం దేశ బహిష్కరణ చెసిన రాజులు; సాంకేతిక రంగంలో వారికి కావల్సిన వాటిని కనిపెట్టలేని శాస్త్రవేత్తలను, పండితులను నరికివేసిన; సజీవంగా ఖననం చేసిన; పుస్తకాలు, రచనలు తగలబెట్టిన రాజులు ఎందరో.
కానీ భారతదేశం లో విచిత్రంగా రాజ్యాదికారం కోసం ఎంతటి దురాగతానికైనా తెగించే రాజు తన స్తాయి కంటే పై హోదాలో ప్రజల మాయ-మత విస్వాసాలకి ప్రతినిదిగా, ప్రజల తరుపున దేవుడికి పూజలు, పురస్కారాలు చేస్తు; దయ్యాలు, ప్రేతాత్మలతో ప్రత్యక్షంగా సంభందాన్ని కొనసాగించడానికి ఉన్న పురోహితుడైన ఒక బ్రాహ్మణున్ని ఎందుకు పెట్టుకున్నాడు? యఙ్ఞ యాగాదులు, దేవుడికి పూజలు, పురస్కారాలు చేస్తాడు కాబట్టి, రాజు తన స్తాయి కంటే పై హోదా బ్రాహ్మణుడికి కల్పించాడా? ఆర్యన్ రాజులు అంత ఉదారత్వం ఉన్నవారా?
రిగ్వేదం లోని, 4.50.8 స్లోకం “అతను (రాజన్య), అతని నివాసంలో సుసంపన్నంగా నివసిస్తుంటాడు, అతనికి (రాజన్య కి) అన్ని విదాలుగా వాడుకోవడానికి భూమిని బహుమతిగా ఇవ్వ బడింది, అతనికి (రాజన్య కి) ప్రజలు (విస్) స్వతాహాగ విధేయత కలిగి ఉంటారు, ఆ రాజన్య ఇంట్లో బ్రాహ్మణ మొదటి స్థానంలో నడుస్తాడు (యాస్మిన్ బ్రహ్మ రజనీ పూర్వహ్ ఐతి).”
పురాతన కాలంలోని పై స్లోకంలో రాజన్య, బ్రాహ్మణ మద్య వున్న అన్యోన్యతకి కారణం ఏమిటి? దేవుడికి పూజలు, పురస్కారాలు; దయ్యాలు, పిశాచాలు, భూతాలకు మంత్రం చేసే బ్రాహ్మణుడు “రాజన్య కి” “ప్రజలు (విస్) స్వతాహాగ విధేయత కలిగి ఉంటారు” అని ఎలా అనగలుగుతుండు? ఈ బ్రాహ్మడు ప్రజల మాయ-మత విస్వాసాలను, ప్రజలకి దేవుడు లేదా దయ్యం మీద ఉన్న నమ్మకాన్ని ఏమార్చి ప్రజలను రాజన్యకి లొంగివుండేటట్లు చేస్తున్నాడా?
అలా దేవుణ్ణి, దయ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను ఏమార్చే కొత్త కొత్త పద్దతులను కనిపెట్టి, ప్రజలు అలోచించకుండా, ప్రజలు ఐక్యంగా కలసి ఉండకుండా, తిరుగుబాటు చేయకుండా, ప్రజలు ఆత్మ స్తైర్యం కోల్పోయి, అత్మ న్యూనతా భావంలో వుండేటట్లు క్షణక్షణం రాజు/రాజన్య కి సేవ, లాభం చేయడం వల్లనే బ్రాహ్మనుడికి రాజు, తన స్తాయి కంటే పై హోదా కల్పించాడా?
ప్రాచిన భారతదేశంలొ అతున్నత పట్టణ సింధూ (ఇండస్) నాగరికతను స్రుష్టించిన ద్రావిడ సంస్క్రుతి, దేశదిమ్మరులైన ఆర్యుల దండయాత్రకు లోనై అంతరించి పోయిన తరువాత. భారతదేశం పట్టణ సమాజం నుండి పశు పోషన సమాజముగ మారిపొయింది (యూరప్ లో పట్టణ సమాజం తదుపరి పారిశ్రామిక విప్లవం వచ్చింది). కొంతకాలం తరువాత (క్రీ. పూ 1500 – 1100) ఈ ఆర్యులు దేశదిమ్మర స్తితి నుండి స్తిర నివాసాలు గూడెం ఏర్పాటుచేసుకున్నరు. పశుపోశనతో పాటు, వ్యవసాయం నేర్చుకున్నారు. వారి గూడెం పాత సినిమాలల్లో ఋషుల వెదురుబొంగుల ఇల్లలాగ, పశువుల కొట్టాలతో, చింత చెట్లు, రావి చెట్లు మొత్తంగా మన ఇప్పటి, ఆది వాసుల గూడెం లాగ, పిచ్చుకల రాగాలతో చుట్టూ దట్టమైన అడవితొ చాలా ప్రశాంతంగా, వానాకాలం ఉరుము, మెరుపులతొ చాలా ఎక్కువ వర్షపాతంతో ఉండేవి. మన గ్రామాల్లోని ప్రజల్లాగ పశువుల ద్వారా వచ్చే, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పొలంలో పండే పంట, జంతూవులని వేటాడడం వారి జీవనాదారం. విరామ సమయంలో చెట్ల ద్వార వచ్చే కల్లు, విప్ప సార లాంటి సోమ పానీయం సేవించి మంట చుట్టూ చేరి రాగాలు తీయడం, చిందులు వేయడం చేసేవారు.
వీరు ప్రకృతిలో జరిగే ప్రతీ మార్పుని, ఉరుమడం, మెరవడం, వానరావడం, ఎండరావడం అన్నీ మానవాతీత శక్తిలో చూసేవారు. వీరికి మేఘాలల్లో దేవుడు కనపడేవాడు, గాలిలో దైవ స్వరం వినిపించేది, మంటలో అగ్ని దేవుడు కనపడేవాడు, పరిసరాలన్ని రాయి, చెట్టు, పుట్ట, పాము, జంతువులు, పక్షులు .. ఇలా అన్నీ దైవత్వంతొ కనిపించేవి. దైవత్వంతో కూడిని ఈ ప్రకృతి శక్తులన్ని, తమ పైన, తమ చుట్టూ తమకు సహాయం చేయడానికి లేదా హాని చేయడానికి ఉన్నట్లుగా పరిగణించేవారు. ఆకాశం మరియు భూమిని దేవుళ్ల మరియు మానవులు యొక్క తండ్రి మరియు తల్లిగా పరిగణించేవారు.
ఈ గూడానికి పెద్దగా రాజన్య ఉండేవాడు. ఈ అర్యుల గూడెం పెద్ద అయినటువంటి రాజన్య, గూడెం ప్రజలకు జ్వరం గాని, జబ్బు గానీ చెస్తే మంత్రం పెట్టడం, కర్మకాండలు చేయడం, శుద్ది, ప్రాయచిత్తం లాంటి పనులన్నీ రాజన్య చేసేవాడు. గూడెం కొంతకాలం తరువాత గ్రామంగా అభివ్రుద్ది అయ్యిన క్రమంలో, రాజన్య కి గ్రామ భాద్యతలు పెరగటం వల్ల, తన మాయ-మత సంభంద పనులు చేయడానికి, తన బదులుగా ప్రతిక్షేపించిన వాడే, బ్రాహ్మణుడు. ఇండో-యూరోపియణ్ భాషలో (బ్రాహ్ + మాన్) దేవుడికి పాట లేదా స్తోత్రం పాడేవాడు.
ఈ బ్రాహ్మణుడు ప్రజల తరుపున దేవుడికి పూజలు, పురస్కారాలు చేస్తూ; దయ్యాలు భూతాలతో మాట్లాడే వాడుగు నటిస్తూ, తమకి అద్భుతమైన అతీంద్రియ శక్తులు వున్నట్లు, తమ మంత్ర పఠనం తో దేవుళ్ళను ప్రత్యక్షం చేసుకోకలిగే వారుగా, అగ్నితో దేవుళ్ళ తో మాట్లాడే శక్తి వున్న వారిగా, కంటికి కనిపించకుండా అదృశ్యం అయ్యె శక్తి వున్నవారిగా, గాలిలోకి తేలిపొయే శక్తి, ఒక చిన్న అణువు పరిమాణంలో వారి శరీరం తగ్గించకోగలిగే శక్తి, నీటి పైన నడిచేవారిగా, వారు కోరుకున్న జీవి రూపంగా మార్చుకోకలిగే అతీంద్రియ శక్తులు వున్న వారిగా, తమ శాపాలతొ ఎవరినైనా శిక్షించే శక్తి కలవారిగా, ఇలా కొత్త కొత్త మార్మిక పద్దతులు కనిపెట్టి, మాయాజాలం తో ప్రజలని ఏమారుస్తు, దేవుని పేరిట ప్రతీ క్షణం రాజన్యకి సేవ చేస్తూ … ప్రతిఫలంగా రాజన్య ద్వారా అన్ని అవకాశాలు పొందుతూ, …బ్రాహ్మణ లేకుండా రాజన్య సంపన్నుడు కాలేడని, అలాగే రాజన్య లేకుండా బ్రాహ్మణ సంపన్నుడు కాలేడని .. భూలోకంలో మరియు పైలోకంలో రాజన్య మరియు బ్రాహ్మణులు పరస్పర సహకారం చేసుకుంటూ … ప్రజల మీద అదిపత్యం సంపాదించి, ఆర్యుల ఇండో యూరోపియన్ త్రివర్గ సిద్దాంతం పటిష్టం అయ్యి రాజన్య మరియు బ్రాహ్మణ రెండు అగ్ర వర్ణాలు ఏర్పడ్డాయి.
సిందూ నాగరిక సమాజం వలే, లిపి కలిగిన భాష వీరికి లేక పోవడం వల్ల, పై పెచ్చు వీరు పశుపొశకులు కావడం చేత, సులభంగా మౌఖిక సాంప్రదాయం పద్దతిలో ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయడానికి వీలుగా వేమన పద్యాలు వంటి రెండు వరుసలలో వీరి సంస్కృత భాషలో కూర్చిన ఈ శ్లోకాలు అప్పటి వారి దేవుళ్ళైన అగ్ని, ఇంద్ర, వరుణ, మిత్ర, సూర్య, సావిత్ర్, విష్ణు, పుసన్, అశ్విన్ కవలలు, సోమ, యమ, పర్జన్య,మారుట్స్, రుద్ర, విశ్వకర్మన్, ప్రజాపతి, ఉషస్, అదితి ని ప్రార్దిస్తూ మంట పెట్టి యజ్ఞం చేసే వారు.
తరువాత కాలంలో రాజన్య తన ఆదిపత్యాన్ని పలు గ్రామాలకు విస్తరించడంతో, రాజన్యకి సహాయం చేయడం కోసం ప్రతిక్షేపించ బడ్డ బ్రాహ్మణుడు, పలు గ్రామాలకి కలిపి ఒక “శాఖ” ని ఏర్పరచి, ఈ మంత్ర స్లోకాలను, యజ్ఞం చేసే పద్దతిని మరికొంత మందికి మౌఖిక సాంప్రదాయం పద్దతిలో నేర్పేవాడు. ఈ “శాఖ” లు రాజన్యకి ప్రజలని మభ్యపెట్టడానికి చాల ఉపయోగపడడం వల్ల, తరువాత కాలంలో రాజన్య అన్ని రకాల వసతులు కల్పించి ఈ “శాఖ” లని పూర్తిస్తాయి, గురుకుల పాటశాలలుగా మార్చాడు. పతంజలి యొక్క మహాభాస్య ప్రకారం, రుగ్వేదం సమయం లో 21 శాఖలు, అదర్వవేద సమయం లో 9, యజుర్వేద సమయం లో 101 (కృష్ణ యజుర్వేదo యొక్క 86 మరియు శుక్ల యజుర్వేద 15) మరియు సామవేదము పఠించడం కోసం 1000 శాఖలు ఉన్నాయి.
వీరి మొదటి కూర్పు రుగ్వేదం లోని 10 మండలాలని 10 కుటుంబాలకు చెందిన 21 మహిళా భ్రాహ్మణులతో కలిపి 407 మంది మొత్తం బ్రాహ్మణులు (ఋషులు) 21 శాఖ లల్లో కూర్చినట్లు, ప్రతీ మండలంలో ఈ కుటుంబం కోసం “అప్రి సూక్త” పేరుతో ఒక స్లోకం ఉంటుంది. మండలం 2 గ్ర్త్సమదస్ వంశం, మండలం 3 విస్వామిత్ర వంశం, మండలం 4 వామదేవ వంశం, మండలం 5 ఆత్రిస్ వంశం మండలం 6 భరద్వాజ వంశం, మండలం 7 వశిస్ట వంశం, మండలం 8 కాన్వస్ వంశం, మండలం 9 కశ్యప వంశం కూర్చినట్లుగా ప్రస్తుత బ్రాహ్మణులు చెప్పుకుంటారు.
చరిత్ర పొడుగునా ఈ బ్రాహ్మణ, రాజన్య మద్య పరస్పర సహకారం, అన్యోన్యత, నిర్మాణం, సంభందం …ఇలాగే కొనసాగి… తరువాత కాలంలో మరింత విస్త్రుతం అయినట్లు బ్రాహ్మణులు వ్రాసిన యజుర్వేదం, బ్రాహ్మణాలు, ఉపనిశత్తులు లాంటి పుస్తకాలల్లో చూడవచ్చు.
వీరి త్రివర్గ సిద్దాంతం ప్రకారం, వీరి ఆరంభ కాలంలో ఆర్యుల ప్రజలతో ఉన్న గ్రామంలో, ఈ బ్రాహ్మణ, రాజన్య కూటమి పాలక వర్గాలుగా గా, మిగిలిన వారు పాలిత ప్రజలు (విస్)గ పరిగణించారు.
కొంత కాలం తరువాత ఆర్యన్ దండయాత్రదారులు, ఆక్రమిత ప్రాంతాల్లో లో స్థానికులుగా మారిపొయారు, ఓడిపొయిన సిందు నాగరికుల్లోని కొందరు మూలవాసులు ఆర్యన్ సమాజంలో కొంత స్థాయిలో విలీనమయ్యారు. ఆర్యులు తమ త్రివర్గ సిద్దాంతం విశ్రుతపరచి చతుర్వర్ణ వ్యవస్తని ఏర్పరచి అర్యన్ వ్యవస్త లోని విస్ ని మూడో వర్గం వైశ్యులుగ, ఓడిపొయిన భారతదేశ మూల వాసులైన సిందూ నాగరకత ప్రజలను నాలుగవ వర్గం “శూద్రులు” గా ఇమిడ్చుకున్నారు.
అంతేకాకుండా వీరి పుస్తకాలల్లో బ్రాహ్మణ, క్షత్రీయుల కూటమి విశ్వంలోని అన్ని జీవజాతుల శ్రుష్టి కర్తలుగ, మూడో వర్గం వైశ్యులు పశువులకి శ్రుష్టి కర్తలుగ చెప్పుకున్నారు.
ఈ ఆర్యన్ దండయాత్రదారులైన బ్రాహ్మిన్, క్షత్రీయ, వైశ్యులు మూలవాసులకి భిన్నంగా ఉండడం కోసం, తమకి తాము రెండవసారి జన్మించిన (జంజం రెండవ జన్మకి చిహ్నం) వారిగా, ఉపనయనం లేదా వొడుగు కలిగి వున్న వారుగా పరిగనించుకున్నారు. మూలవాసులైన శూద్రులు మరియు అంటరాని వారికి వడుగు వుండదు.
ఇక్కడ ప్రదానమైన విషయం గమనించవలసింది, బ్రాహ్మణ, రాజన్య కూటమి పాలక వర్గాలుగా గా, మిగితా అర్యన్ మూడో వర్గం వైశ్యులు మరియు మూలవాసులైన శూద్రులను కలిపి పాలిత ప్రజలు (విస్)గ పరిగణించినట్లు వీరు వ్రాసిన పుస్తకాలల్లో చూడవచ్చు.
ఈ ఆర్యులు పంచముడిని శ్రుష్టించి చాతుర్వర్ణాన్ని ఐదుకి పెంచినా, భారతదేశ ప్రజలను 100 వర్ణలుగా విడగొట్టినా, ప్రస్తుతం వున్న 3000 కులాలకు పైగా విడగొట్టినా, వీరి మూల సూత్రం, బ్రాహ్మణ, రాజన్య కూటమి పాలక వర్గాలుగా, మిగిలిన వారు పాలిత ప్రజలు (విస్)గ పరిగణించారు.
బ్రాహ్మణ, క్షత్రీయ, ప్రజల (విస్) సంబందం ఎలా వుండాలో సత్పథ బ్రాహ్మణ పుస్తకములొని 11.2.7.16 స్లొకం … “రెండవ కేక్ విస్ (ప్రజలు); మరియు, నిజానికి విస్ (ప్రజలు) రెండవ కేక్ అని ఎవరికి తెలుసో, వాళ్ళు (బ్రాహ్మణ, క్షత్రీయ)సురక్షితంగ, పరిపూర్నంగ తమ సుఖం కోసం వాడుకొవచ్చు. మరియు ప్రజలు దేన్ని సంపాదించుకుంటరొ అది అంతా వీళ్ళకు (బ్రాహ్మణ, క్షత్రీయ) చెందినదె.మరియు సాద్యమైనంత వరకు తక్కువ స్వరిత సమర్పణ కాబట్టి మొదటి కేక్ అగ్ని (బ్రాహ్మణ)కి సమర్పించాలి, అందువల్లనే బ్రాహ్మణ మరియు క్షత్రీయ యొక్క ఆదిపత్యం ప్రజల మీద స్థిరపడ్డాయి.”
సిగ్గు, బిడియం వదలిపెట్టి వ్రాతపూర్వకముగ, తమ (బ్రాహ్మణ, క్షత్రీయ) సుఖవంతమైన జీవితం సామన్య ప్రజలను దోచుకునె దాని మీద వున్నదని ఒప్పుకొవడమే కాకుండ, ” బ్రాహ్మణ మరియు క్షత్రీయ యొక్క ఆదిపత్యం ప్రజల మీద స్థిరపడ్డాయి” అని వ్రాసుకున్నారు.
బ్రహ్మ దేవుని పుట్టుక
ప్రజల మాయ-మత విస్వాసాలకి ప్రతినిదిగా, ప్రజల తరుపున దేవుడికి పూజలు, పురస్కారాలు చేస్తు; దయ్యాలు, ప్రేతాత్మలతో ప్రత్యక్షంగా సంభందాన్ని కొనసాగించడానికి ఉన్నటువంటి పురోహితుడైన ఒక బ్రాహ్మణుడు, వేదాలు కూర్చే అవకాశాన్ని ఉపయోగించుకొని, రాజుని తన గుప్పిట్లొ పెట్టుకొని, పాలక వర్గంగా వుంటూ చివరికి మానవుడైన బ్రాహ్మణుడే, తనకు తాను “ఆత్మ” గా, దేవుడిగా, ఈ మొత్తం విశ్వం యొక్క స్రుష్టి కర్తగా తనకు తాను ప్రకటించున్న వైనం, అత్యంత జుగుప్సాకరంగ, వీరికి దేవుడి పట్ల, దైవం పట్ల, ప్రజల పట్ల వున్న అపనమ్మకాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది.
రుగ్ వేదం-సమయంలో ఈ బ్రాహ్మణులు ద్యావుస్ మరియు వరుణ దేవుళ్ళని ప్రాముఖ్యత లేని వారుగా చేసి. క్షత్రీయ దేవుడైన ఇంద్రుడుని, అత్యున్నత స్థానంలో పెట్టి, అతడి గౌరవార్థం అత్యధిక సంఖ్యలో శ్లోకాలు వ్రాసారు. అంతేకాకుండా దేవుళ్ళందరికి దేవుడిగా అత్యున్నత దేవుడిగా మరియు విశ్వ మనిషి గా “పురుష” (RV 10.90) అని ప్రకటించి, పురుష సూక్తం “పురుష ముఖం బ్రహ్మిణ్, భుజాలు క్షత్రీయ, తొడలు వైశ్య, పాదం శుద్ర” అని వ్రాసారు.
కొత్త దేవుడు ప్రజాపతి (RV 10.121.10) ని కేవలం రుగ్-వేదంలో పేర్కొన్నారు, కాని యజుర్-వేద కాలంలో “పురుష” ని తీసివేసి, అతని స్తానంలో కొత్త దేవుడు “ప్రజాపతి” ని దేవుళ్ళందరికి దేవుడిగా అత్యున్నత దేవుడిగా మరియు మానవులు యొక్క తండ్రి అని. విశ్వంలో వాస్తవమైనది “ప్రజాపతి” అని పేర్కొన్నారు.
బ్రాహ్మణాలు పుస్తకాలల్లో ప్రజాపతి దేవుణ్ణి మానవుని ఆత్మ గా (సతపత బ్రాహ్మణ 4.6.1) మరియు బ్రాహ్మణున్ని (సతపత బ్రాహ్మణ 7.3.1.42) అత్యున్నత దేవుడైన ప్రజాపతితో పొల్చడం బ్రాహ్మణుడి పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ గుర్తింపు చివరకు ఉపనిషత్తుల్లోని బ్రాహ్మణ-ఆత్మ సిద్ధాంతం గా మారి, ఉపనిషత్తులు బ్రాహ్మణున్ని అత్యున్నత దేవుడుగా మరియు మొత్తం విశ్వంలో వాస్తవమైనది “బ్రాహ్మనుడు” అని పెర్కొన్నారు
ప్రజల మాయ-మత విస్వాసాలకి ప్రతినిదిగా, ప్రజల తరుపున దేవుడికి పూజలు, పురస్కారాలు చేసే మామూలు బ్రాహ్మణుడు, తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోని, వెయ్యి సంవత్సరాల క్రితం నుండి (క్రీ.పూ 1500) తమ బ్రాహ్మణ పూర్వికులు రుగ్వేదం, సామవేదం, యజుర్వేదంలో , ఈ ప్రపచం, భూమీ, ఆకాశం, వాతావరణం, మనుశులను, దేవుళ్ళను, వర్ణాలను శ్రుశ్ఠించినట్లు చెప్పిన, సుప్రీం దేవుళ్ళు “పురుష”, “ప్రజాపతీ” లు, వుత్తుత్తి దేవుళ్ళని, … మానవుడైన “భ్రాహ్మణుడు” మాత్రమే నిజమైన సుప్రీం దేవుడని, భ్రాహ్మణుడు ఆత్మ అని ఉపనిషత్తులు చెప్పారు.
అంతేకాక ఈ ఉపనిశత్తులల్లో, బ్రాహ్మణ అంటే సర్వం తప్ప మరొకటి కాదు. నిజానికి, ‘ఇది అన్ని విషయాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణ అనంతమైన, ఏ రకంగానూ బాధపడనట్టి, మార్పు చేయరాని, శాశ్వతమయిన, మరియు తెలివైన వాస్తవికత. అతను అన్ని జీవుల కి ఆత్మలా వుంటాడు. ఈ అత్మ మరణంలేనిది, అన్ని జీవులు అత్మలో, అత్మ అన్ని జీవుల్లో దాగి వుంటుంది. ఈ అత్మే భ్రాహ్మణుడు, అంటూ వివరిస్తారు.
అంతేకాక ఈ ఉపనిశత్తులల్లో, ఋషులు, మునులు లాంటి సామాన్య సంసార జీవితం పై విరక్తి చెంది, “జీవితం యొక్క పరమార్దాన్ని” తెలుసుకోవాలనుకొనే వారి కొసం, అరణ్యకాలు అని జ్గ్ణానకాండ పేరుతొ గ్రందాలు వ్రాసారు. ఋషులు, మునులు అడవికి పోయి, తపస్సు చేస్తు అత్మను (భ్రాహ్మణ) శోదిస్తు, అత్మ పరిత్యోగులుగ ఎలా కావాలో వివరంగా వివరంచారు.
మరి కొన్ని వందల సంవత్సరాల తరువాత, మను లాంటి వారు తమ తాత ముత్తాలు తమ లాంటి బ్రాహ్మణుల కోసం అర్జించిపెట్టిన “సుప్రీం దేవుడు భ్రాహ్మణుడు” దైవత్వాన్ని, ముందు ముందు అర్య మరియు అర్యేతర వర్ణాల ప్రజలు, ఈ ఉపనిశత్తులు చదివి అర్దంచేసుకొని, వారి వర్ణ ప్రజలని దేవుళ్ళుగా తిరిగి వ్రాసుకుంటారని, దీన్ని నివారించడంకోసం, ఈ భ్రాహ్మణుడి పిల్లలు, మనవళ్ళు, తర తరాలు ప్రజలకి “దేవుళ్ళు” గా, మరియు రాజన్య పిల్లలు, మనవళ్ళు తరతరాలు ఎప్పటికీ ప్రజలకి రాజులుగా తమ ఆదిపత్యాన్ని శాస్వితం చేసుకొవడం కోసం, నిజమైన సంసార జీవితం గడుపుతున్న గ్రామ ప్రజల కోసం ఖర్మ సిద్దాంతాం పేరుతొ “దర్మ సూత్రాలను” కనిపెట్టారు.
అంతే కాకుండా అర్యేతర జాతులు, శూద్రులు, అంటరానివారు ఈ వేదలు చదవితె నాలుకలు కోసి, వింటె చెవులల్లో సీసం పోసి, అలోచించకుండా చేశారు. ఈ ఖర్మ సిద్దాంతం, ద్వారా గ్రామాల ప్రజలు ఎవరి వ్రుత్తులు వారు చేసుకుంటు, వివిద వ్రుత్తుల వారు పరస్పర సహకరం చెసుకుంటు, జీవనాధార ఆర్థిక వ్యవస్థ ఏర్పరచుకోని (సబ్సిస్టన్సి ఎకానమి), గ్రామం రాజుకి పన్నులు కట్టుకుంటు, భ్రాహ్మనున్ని దేవుడిగా కొలుస్తు గడిపెటట్లు వర్ణసిద్దాతం ఉపయోగ పడింది.
మనం చరిత్ర కొంచం పరిశీలిస్తే, ఈ రాజులు బ్రాహ్మణులకి గుడులు కట్టడం తప్ప, గ్రామ ఆర్దిక పరిస్తితిని అభివ్రుద్ది చెయ్యడం కోసం, కొత్త పనిముట్లను కనిపెట్టడం కాని, కొత్త వ్యవసాయ, పశు గణాభివ్రుద్ది పద్దతులను కనిపెట్టడం చేయలెదు. ప్రజలకు ఈ రాజులు ఏమి చేయనప్పటికి, ప్రజలు వివిద కులాలుగ విడగొట్టపడి, తమ ఖర్మ అనుకొనేటట్లు చేసి, ఈ బ్రాహ్మణ, రాజన్య ఆదిపత్యం ఏర్పరచుకోని వేల సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు.
comment closed