Home » Caste System » ఇండస్ వర్సస్ ఆర్యన్ సంస్కృతి అనే అంశంపై ఒక రోజు వర్క్ శాప్

ఇండస్ వర్సస్ ఆర్యన్ సంస్కృతి అనే అంశంపై ఒక రోజు వర్క్ శాప్

ఇండస్ వర్సస్ ఆర్యన్ సంస్కృతి అనే అంశంపై ఒక రోజు వర్క్ శాప్
తేది: 3 మార్చ్, 2013 (ఆదివారం)
సమయం: ఉదయం 10 గం.లకు
వేదిక: సుందరయ్య విజ్ణాన కేంద్రం
భాగ్ లింగంపల్లి, హైదరాబాద్

ఒక వస్తువు లేదా ఒక జీవి యొక్క పుట్టుక మూలాదారం తెలుసుకోవడం అంటే వాటిపై ఆదిపత్యాన్ని సంపాదించిన మాంత్రిక శక్తిని స్వంతం చేసుకోవడంతో సమానం, ఈ పొందిన శక్తి,  వాటిని  నియంత్రించడానికి, వాటిని రెట్టింపు చేయడానికి లేదా పునరుత్పత్తి చేయడానికి ఉపయోగ బడుతుంది. 

ప్రజలకు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి హేతుబద్ధమైన పద్ధతులు విఫలం అయినప్పుడు,  ఆలోచన బద్దమైన తర్కం సరైన మార్గాన్ని చూపెట్టనప్పుడు, ఒక అవాస్తవమైన పురాణగాధను   ప్రచారంలోకి తెస్తారు. ఈ అవాస్తవమైన పురాణగాధ తాత్కాలికంగా ఒక వైరుధ్యంని అధిగమించే  తార్కిక నమూనాను కలిగివుంటుంది. ఇలాంటి ఒక అవాస్తవమైన పురాణగాదే “కులం వ్రుత్తి ద్వారా పుట్టింది” అనే నానుడి. 

భారతదేశం యొక్క 120 కోట్ల మంది జనాబాలో, 100  కోట్ల మంది హిందువులు విభిన్న జాతులుగా 25 ప్రభుత్వ గుర్తింపు పొందిన భాషలు మరియు వంద కంటే ఎక్కువ మాండలికాలు మాట్లాడే వారుగా విభజించ బడ్డారు. వారు మళ్లీ 3000 కులాలు, వాటికి ఉప కులాలు కలిగి విభజించబడ్డారు. ఈ కులాలల్లో ఒకటైన, బ్రాహ్మణులు 800 ఉప కులాలుగా విభజించబడ్డారు. ఇప్పటికీ ఈ 800 బ్రాహ్మణుల ఉపకులాల్లో ఎక్కువ మంది  కలసి మెలిసి భోజనం చేయరు, ఒకరిని ఇంకొకరు వివాహం చేసుకోరు. ఈ కుల వ్యవస్త మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని నిర్మించింది. ఒక వైపు పవిత్రుడైన  బ్రాహ్మణుడు మరో అంచున అంటరాని వారు. వాటి మధ్య లెక్కలేనన్ని వివిధ స్థాయిలల్లో వివిద కులాలు నిర్మించ బడ్డాయి.   

భారతదేశంలో కుల వ్యవస్త ఉన్నంతకాలం హిందువులు అరుదుగా వివిద కులాల మద్య వివాహం లేదా ఇతర సామాజిక సంబంధాలు కలిగి ఉండేపరిస్తితి లేదు; మరియు హిందువులు అమెరిక వంటి ఇతర ప్రాంతాలకు వలస పోతున్న ప్రస్తుత తరుణంలో, భారతీయ కుల సమస్య  ప్రపంచ సమస్య అయ్యింది. కుల వ్యవస్త మూలంగా ఇతర దేశాల ప్రజలు భారతదేశం వెళ్లి శతాబ్దాల తరబడి అక్కడే స్త్హిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికి, వీరు సమాజంలో ఇమిడిపొకుండా బయటివారుగానే పరిగణించబడే పరిస్తితి ఉంది. 

ఈ కుల వ్యవస్త  కనీసం 3000 సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతూ, హిందువుల అన్ని సామాజిక వ్యవహారాలు, ఆచార సంప్రదాయాలు కుల వ్యవస్థకు సరిపోయే విధంగా తయారు చేయబడి ఒక సంక్లిష్ట వ్యవస్త రూపొందించబడింది. వేదాల పేరుతో వ్రాసిన అర్దశాశ్త్రం, వర్ణాశ్రమ దర్మశాశ్త్రం, కామసూత్రాలు, పురాణాలు, ఉపనిశత్తులు లాంటి సాహిత్యం అంతా ప్రజలను వర్గీకరించి ప్రజలు జీవితంలో తమ తెలివి తేటలని పెంచుకొని, తమ శక్తి యుక్తులను ప్రదర్శించే  అవకాశం ఇవ్వకుండా  మతపరమైన మరియు రాజకీయ ఆంక్షలు, వెలివేతలు విదించి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎలాంటి వ్రుత్తిని ఎంచుకోవాలి, అతని విదులు,  తన మతం, సమాజంలో అతని స్థానం  అన్నీ నిర్ణయించాయి. 

ఈ సంక్లిష్ట కుల వ్యవస్థకి  వ్యతిరేకంగా ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు జరిగిన  తిరుగుబాట్లు చాలా వరకు “ఆర్యన్ దండ యాత్ర” వల్ల మాత్రమే మొదట, రాజన్య, బ్రాహ్మణుడి పుట్టుక, ఈ బ్రాహ్మణ – క్షత్రీయ ఆదిపత్యాన్ని కొనసాగించడానికి తరువాత వర్ణ వ్యవస్త, తరువాత కుల వ్యవస్త ఏర్పడ్డాయనే సరైన అవగాహన లేక పోవడం వల్ల, ఈ తిరుగుబాట్లు చాలావరకు ముస్లిం మతాన్ని, క్రిష్టియన్ మతాన్ని బలోపేతం చేయడానికే ఉపయోగ పడ్డాయి. 

మన భారతదేశం లో ప్రపంచంలొ ఎక్కడా లేని ఒక మానసిక రుగ్మత సిద్దాంతం వర్ణ వ్యవస్త తోటి మానవుణ్ణి అంటరానివారిగా, వ్రాతపుర్వకంగా 90% మంది ప్రజలని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని శూద్రులుగా బానిసలుగా చేసిన కులవ్యవస్త నిర్మూలనకోసం జ్యోతీభా పూలే, అంబేద్కర్ వంటి వారు మరియు మరోవైపు ఫ్యూడల్ సమాజాన్ని కూలదోసి నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయాలని ఎందరో మార్క్సిస్ట్, లేనినిస్ట్, మావోయిస్ట్ సిద్దాంత కారులు, గత వందల సంవత్సరాలుగా పోరాడి వేలాది మంది తమ  ప్రాణాలు దారపోసారు.   

మార్క్సిస్ట్ సిద్దాతం ప్రకారం, మానవ సమాజం ఎప్పటికీ అభివ్రుద్ది వైపు పోతుందని ఆదిమ సమాజం నుండి, బానిస సమాజం గా, ఆపైన ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ సమాజం వ్యవసాయంలో అదికోత్పత్తి సాదించి పట్టణీకరణ చెంది,  పారిశ్రామిక విప్లవంతో  ఆపైన పెట్టుబడిదారి (ప్రజాస్వామ్యం) సమాజం ఆవిర్భవిస్తుందని,  ఆపైన కమ్యూనిస్టు సమాజం వస్తుందని చెప్పుతారు. 

కాని భారతదేశంలో ద్రావిడ సింధూ (ఇండస్) నాగరికత ప్రజలు ఆదిమ సమాజం నుండి, బానిస సమాజం గా మార్పుచెందకుండానే, ఫ్యూడల్ సమాజంగా, ఈ ఫ్యూడల్ సమాజం వ్యవసాయంలో అదికోత్పత్తి సాదించి పట్టణీకరణ చెంది ఆనాటి ప్రాచీన నగర సమజాలైన ఈజిప్తు, మెసపటొమియ లకు ధీటుగా హరప్పా, మొహంజదారొ, డోళవీర, లొథల్, రాఖిగఢి, గన్వెరివాల లాంటి అర డజను నగరాలు, దాదాపు 2000 చిన్న పట్టణాలతొ క్రీస్తు పూర్వం 3000 నుండి 1700 సంవత్సరాల వరకు దాదాపు 1300 సంవత్సరాలు లిపి కలిగిన భాషతొ సిందూ నది పరివాహక ప్రాంతములొ పట్టణ నాగరికత విలసిల్లింది. 

మార్క్సిస్టు సిద్దాంతం “మానవ సమాజం ఎప్పటికీ అభివ్రుద్ది వైపు పోతుంది” అనేదానికి  భిన్నంగా వ్యవసాయంలో అదికోత్పత్తి సాదించి పట్టణీకరణ చెందిన  ద్రావిడ సిందూ నాగరికత, పారిశ్రామిక విప్లవం వచ్చి పెట్టుబడి దారి సమాజం గా మార్పు చెందాల్సింది పోయి దేశదిమ్మర పశుపోశకులైనటువంటి ఇండో-ఆర్యన్ల  దాడికి గుర అయ్యి, భారతదేశం పట్టణ సమాజం నుండి పశు పోషన సమాజముగ మారిపొయింది. 

పట్టణ సమాజాన్ని పశుపోశన సమాజంగా మార్చిన ఆర్యులు, సంస్కృత భాషలో 2 కోట్ల స్లోకాలను వ్రాసి, కమ్యూనిష్టులు ప్రజలను వర్గీకరించి పెట్టుబడుదారు, భూర్జువా, పెటీ-భూర్జువా, కార్మికుడు, రైతు, రైతుకూలి అంటే ఎవరో నిర్వచించి వివరించినట్లు, ఈ ఆర్యులు శ్లొకాల ద్వార రూపొందించిన వర్గీకరణ విశ్వం లొ వున్న ప్రతీ దాన్ని, ప్రకృతి, పశువులు, చెట్లు, మనుశులు, వేదాలు, సంశ్క్రుత భాష, మానవ శరీరం, ఇలా అన్ని బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య మూడు వర్గాలుగ  విడగొట్టి,  బ్రాహ్మణ, క్షత్రీయుల కూటమి విశ్వంలోని అన్ని జీవజాతుల శ్రుష్టి కర్తలుగ, మూడో వర్గం వైశ్యులు పశువులకి శ్రుష్టి కర్తలుగ చెప్పుకున్నారు. ఈ స్లోకాలల్లో భ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర, చండాలుడు, నిశాదుడు, … ఇల ప్రతీదాన్ని నిర్వచించి వివరంగ వివరించి వీరు రాజుకి ఎలా అనిగి మనిగి వుండాలో, బ్రాహ్మణున్ని దేవుడిగా ఎలా పరిగణించమని దేవుడు చెప్పాడొ వివరంగా వ్రాసారు. 

అత్యంత నాగరికతను సాదించి, వివిద అంతస్తుల భవనాల్లో నివసించిన సిందూ నాగరికుడు మొదట అర్యుల గొడ్లకాపరిగా (దాస్యుడు), మరికొన్ని వందల సంవత్సరాల తరువాత శూద్రుడిగా మరికొంతకాలం తరువాత వీరిలో కొందరు అంటరానివారుగా వెలివేయ బడ్డారు. తరువాత కాలంలో వీరు ఎన్నో కులాలుగా, ఉపకులాలుగా విడగొట్టబడి మతపరమైన మరియు రాజకీయ ఆంక్షలు, వెలివేతలకు గురయ్యారు. 

శ్రమతొ ప్రకృతిని, పదార్దాన్ని మార్చె ప్రక్రియని అసహ్యమైనదిగ, తోటి మానవుణ్ణి  అంటరానివారిగా, గుణం తక్కువ వారిగా, శూద్రునిగా, పందిని దేవుడి అవతార రూపంగా వర్ణిస్తూ వ్రాసిన ఈ 2 కోట్ల స్లోకలల్లో మానవులు సంభాషించుకోవడానికి, కవిత్వంగా వ్రాసుకోవడానికి, పాటగా పాడుకోవటానికి కనిపెట్టబడ్డ భాషని మంత్రాలు, తంత్రాలుగా మార్చి, బ్రాహ్మణుణ్ణి దేవుడిగా, ఆత్మగా చెప్పుతు,   బ్రాహ్మణ – క్షత్రీయ కూటమి వారిమద్య వైరుద్యాలని ఎలా పరిష్కరించుకోవాలి, శుద్ర, అంటరాని వారు అత్మస్తైర్యం కోల్పోవడానికి అవలంబించాల్సిన మానిసికంగా కుంగదీసి అత్మన్యూనతా భావంలోకి నెట్టే కొత్త కొత్త  ఎత్తుగడలు ఇలా ఎన్నో ఆంక్షలు, వెలివేత పద్దతులు కనిపెట్టారు తప్ప, వ్యవసాయాన్ని అభివ్రుద్ది చేయడానికి, కొత్త నాగలిని కనిపెట్టడం గాని, బట్టలు నేయడానికి కొత మరమగ్గం కని పెట్టడం గాని, కొత్త వస్తూవులను కనిపెట్టడం కాని చేయలేదు. 

ప్రజల మాయ-మత విస్వాసాలకి ప్రతినిదిగా, ప్రజల తరుపున  దేవుడికి పూజలు, పురస్కారాలు చేస్తు; దయ్యాలు, ప్రేతాత్మలతో ప్రత్యక్షంగా సంభందాన్ని కొనసాగించడానికి ఉన్నటువంటి పురోహితుడైన ఒక మామూలు బ్రాహ్మణుడు, వేదాలు కూర్చే అవకాశాన్ని ఉపయోగించుకొని, రాజుని తన గుప్పిట్లొ పెట్టుకొని, పాలక వర్గంగా వుంటూ చివరికి మానవుడైన బ్రాహ్మణుడే,  అంతకుముందు వెయ్యి సంవత్సరాల క్రితం నుండి (క్రీ.పూ 1500) తమ బ్రాహ్మణ పూర్వికులు రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం లో, ఈ ప్రపచం, భూమీ, ఆకాశం, వాతావరణం, మనుశులను, దేవుళ్ళను, వర్ణాలను శ్రుశ్ఠించినట్లు  చెప్పిన, సుప్రీం దేవుళ్ళు “పురుష”, “ప్రజాపతీ” లు, వుత్తుత్తి దేవుళ్ళని,  … మానవుడైన “భ్రాహ్మణుడు” మాత్రమే నిజమైన సుప్రీం దేవుడని, భ్రాహ్మణుడు ఆత్మ అని ఈ మొత్తం విశ్వం యొక్క స్రుష్టి కర్తగా  ఉపనిషత్తులల్లో తనకు  తనకు తాను ప్రకటించున్న వైనం, అత్యంత జుగుప్సాకరంగ, వీరికి దేవుడి పట్ల, దైవం పట్ల, ప్రజల పట్ల వున్న  అపనమ్మకాన్ని, అహంకారాన్ని  తెలియజేస్తుంది. 

ఈ బ్రాహ్మణ-క్షత్రీయుల కూటమి అదిపత్యం కోసం ఏర్పడ్డ వర్ణ/కుల వ్యవస్త ప్రజాస్వామిక రాజ్యాంగం మూలంగా, రాజులు రాజరికం అంతరించింది. ఈ 65 సంవత్సరాల ప్రాజాస్వామ్యం, రిజర్వేషేన్లు అందించడం మూలంగా కొంతమేర కింది వర్ణాల ప్రజలు అన్నిరకాల స్తాయిల్లోకి ఎగబాకరు. కాని వర్ణ వ్యవస్తకు, రాజుకి సైద్దాంతిక అణిచిత పద్దతులను, ఆంక్షలను, వెలివేత పద్దతులను అందించి, తోటి మానవుడు శూద్రుడిగా, అంటరాని వారుగా పరిగణింప బడడానికి మూల కారకుడైన  బ్రాహ్మణుడు ఇప్పటికీ గుళ్ళళ్ళో దేవుడిగా పరిగణింపబడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తిరుపతి దేవస్తానం వంటి వాటిల్లొ ఇప్పటికి ప్రజాదనాన్ని కొల్లగొట్టడం మహాఘోరం. 

1. 3 శాతంగా ఉన్న బ్రాహ్మణులకి, ప్రతీ గుడిలో జనాభా ప్రాతిపదికగా 3 శాతం కంటే ఎక్కువగ పూజారులను నియమించ వద్దు.

2. ప్రతీ గుడిలో జనాభా ప్రాతిపదికగా 50 శాతం  పూజారులుగా స్త్రీలను బి.సి, యస్.సి, యస్.టి సబ్ కాటగిరీలుగా విభజించి నియమించాలి.

3. సంస్కృత భాషలో వ్రాసిన 2 కోట్ల స్లోకాలను, సంస్కృత ప్రొఫెసర్లని నియమించి తెలుగులోకి తర్జుమా చేసి, స్లోకాల్లోని త్రివర్గ సిద్దాంతం ప్రజలు అర్దం చేసుకోవడానికి అందుబాటులో వుంచాలి. 

ఇండస్ హెరిటేజ్ సెంటర్ (“సింధూ వారసత్వ కేంద్రం”) గురించి … 

ఇండస్ హెరిటేజ్ సెంటర్ (“సింధూ వారసత్వ కేంద్రం”) ఒక స్వతంత్ర, లాభాపేక్షలేని పరిశోధన సంస్థ. ఈ అధ్యాయన కేంద్రం సింధూ నాగరికత, సామాజిక జీవితానికి సంభందించిన పలు అంశలపై పరిశొదనలు చేపడుతుంది. ఇండొ-ఆర్యన్, వైదిక యుగ వేదవాజ్ణ్మయాన్ని విమర్షనాత్మకఒగా వివరించడం, వర్ణ వ్యవస్త పుట్టుపూర్వొత్తరాల్ని సొదాహరణముగ వివరించడం, వర్గీకరణ, ద్విజులకి రిజర్వెషన్ సిద్దంతాన్ని సమర్దించే వైదిక సాహిత్యాన్ని డికోడ్ చెయడం జరుగుతుంది. పురుష సూక్త వర్గీకరణ, మూలవాసిల ప్రతిఘఠన చైతన్యం ఉద్యమాల ప్రాముఖ్యతను రెకర్ద్ చెయడం ఈ సంస్త ఉద్దేశం. 

ఈ అధ్యాయన కేంద్రం పరిశోదనలు సిద్దాంత భావజాలం పై ఆదారపడకుండా, పురాతత్వ ఆధారాలు, వేదాలలోని స్లోకాల ఆదారాలు, అనుభావిక ఆదారాలు ఆధారంగా  “భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక సమస్యలను” పరిశోదించి సమతుల్యతను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆలోచింపచేసే హేతుబద్ధ చర్చలు చేస్తుంది.

Related Articles:

Jyotiba Phule - The lower castes are aboriginal people
Origin of Brahmin
Roots of Caste System
Tripartite Varna System - Slokas
Upanayana or Vodugu

comment closed

Copyright © 2026 · Indus Heritage Center · All Rights Reserved