Home » Caste System » వర్ణవ్యవస్త – మూడు సిద్దాంతాలు

వర్ణవ్యవస్త – మూడు సిద్దాంతాలు

వర్ణవ్యవస్త – మూడు సిద్దాంతాలు

పట్టణ సమాజాన్ని పశుపోషన సమాజంగా మార్చిన ఆర్యులు,  జ్ఞానాన్వేషణ పేరుతో శ్లొకాల ద్వార విశ్వం లొ వున్న ప్రతీ దాన్ని బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులుగా వర్గీకరించి, వీరికి సేవ చేయడానికి శుద్ర, అంటరాని వారిని సృష్టించి తద్వార సామాజిక అంతరాలు సహజమైనవిగా, న్యాయమైనవిగా,  సక్రమమైనవిగా  చూపించడానికి రూపొందించిన వర్ణ వ్యవస్త సిద్దాంతాన్ని సమర్దించుకోవడానికి, ప్రజలు సులువుగా ఆచరించడానికి,  ఆర్యులు ప్రవేశ పెట్టిన మూడు సిద్దాంతాలు.

 మొదటిది వర్గీకరణ: ఆలోచనకు, తర్కానికి (లాజిక్),  కారణం వివరించడానికి (రీజనింగ్) మూలాదారం వర్గీకరణ. అసలు ఆలోచించడం అంటేనే వర్గీకరణ, క్రమీకరించడం, పోల్చుకోవడం. ప్రపంచం లోని ప్రతీ దాన్ని వాటి మధ్యగల సర్వసాధారణ లక్షణాలను బట్టి, సారూప్యత ప్రమాణాలను ఆధారం చేసుకొని  వర్గీకరిస్తాం. మనం దేన్నైనా చూస్తున్నాము అంటేనే, వర్గీకరించిన వస్తువులను చూస్తున్నాము అని, ఆలోచిస్తున్నాము అంటేనే విశయాలను లేదా వస్తువులను వర్గీకరించడం చేస్తున్నాము అని లేదా వర్గీకరించిన వస్తూవుల గురించి ఆలోచన చేస్తున్నాము అని, మాట్లాడుతున్నాము అంటే వర్గికరించిన వాటి గురించి లేదా వర్గీకరించడానికి మాట్లాడుతున్నాము అని  అర్దం. ఉదాహరణకు చెట్టు, ఇల్లు, ఆవు, సూర్యుడు, చంద్రుడు, వెలుగు, చీకటి, కంప్యూటర్, పెన్, కారు, సైకిల్, తలుపు, గుర్రం, పక్షి  … ఇలా ప్రపంచంలో ఉన్న వాటిని వివిద తరగతులుగా వర్గీకరించుకోని, మానవుడు విషయాలను అర్దం చేసుకుంటాడు.

దీనికి విరుద్ధంగా, ప్రపంచలోని విషయాలను వివిద తరగతులుగా  లేదా వర్గాలుగా  లేదా విభాగాలుగా విభజించకుండా చూస్తే పూర్తిగా అస్తవ్యస్తమై, ఏ విషయం అర్దం కాకుండా పోతుంది.  ఒక మనిషి యొక్క తెలివి తేటలు అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని  వర్గీకరించే పద్దతి మీదే ఆదార పడుతుంది. ఏదైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని వివిద తరగతులుగా లేదా వర్గాలుగా లేదా విభాగాలుగా విభజించి  నిర్మాణం చేయడం ద్వారా వాటిని నిర్వహించడం తేలిక అవుతుంది. అందుకే వర్గీకరణ అనేది మానవుని ఆలోచనకు కేంద్ర భిందువు మాత్రమే కాదు, ప్రాదమికమైన ఆలోచించే శక్తిని ప్రసాదించే అత్యంత ఆవశ్యకమైనది. తల్లి గర్భం నుండి అమాయక పిల్లవాడు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టింది మొదలు తన ఇంద్రియాల ద్వారా  వ్యవస్థీకృత బాహ్య ప్రపంచాన్ని తన  అనుభూతితో సారూప్యత ప్రమాణాలను ఆధారం చేసుకొని వర్గికరించుకుంటాడు.

మానవుడు ప్రకృతిని జీవులు మరియు నిర్జీవులుగా వర్గీకరించాడు. మళ్ళీ జీవులని జంతువులు, చెట్లు, పక్షులు, మనుశులు … లాంటి వర్గాలుగా వర్గీకరిస్తం. నిర్జీవులని కొండలు, ఆకాశం, భూమి … లాంటి వర్గాలుగా వర్గీకరిస్తం.

మళ్ళీ చెట్లని ఆపిల్, జామ, వేప, టేకు ఇలా ఎన్నో విదాలుగా వర్గీకరించ వచ్చు. ఈ చెట్లన్ని కూడా  భూమిలో నుండి పుట్టి, మొక్కై, చెట్టు గా బతికి, కాయలు కాసి, తరువాత చచ్చిపోతయ్. అంటే ఆపిల్ చెట్టు పుట్టి, చెట్టు అయ్యి, ఆపిల్ కాయలను కాసి, తరువాత చచ్చి పోతుంది. అలాగె అన్ని చెట్లు పుట్టి, కాయలు కాసి, తరువాత చచ్చిపోతయ్. అలాగే జంతువులు, ఉదాహరణకి కుక్క పుట్టి, కుక్కలాగ బతికి, కుక్క పిల్లలని కని ముసలిదయ్యి చచ్చి పోతది.

మన పూర్విక బ్రాహ్మణ మిత్రులు, చెట్లల్లొ ఆపిల్, జామ, టేకు … లాంటి వర్గాలున్నట్లు, జంతువుల్లో కుక్క, గుర్రం, పిల్లి … ఉన్నట్లు, మొక్కల్లో గులాబి, మల్లె, లాంటి వి వున్నట్లు …. మనుశుల్లో కూడా బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర, నిశాద … లాంటి వర్గాలు ఉంటయ్, ఈ వర్గాలు కూడా మిగిలిన జీవజాతులు చెట్లు, మొక్కలు, గుర్రం, నక్క, కుక్క … లాంటి వాటి లాగ పుట్టి, పెరిగి, పిల్లలని కని, చచ్చి పోతయ్ అని కనుక్కున్నారు.

అంటే ఒక ఆపిల్ చెట్టు పుట్టి, పెరిగి, ఆపిల్ చెట్టు లాగ బతికి, ఆపిల్ కాయలను కాసి, చచ్చిపోయినట్లు, అలాగే  ఒక కుక్క పుట్టి, పెరిగి, కుక్కలాగ బతికి, కుక్క పిల్లలని పెట్టి, ముసలిది అయ్యి చచ్చిపోయినట్లు; ఒక బ్రాహ్మణుడు పుట్టి, పెరిగి, బ్రాహ్మణుడిగా బతికి, బ్రాహ్మణ పిల్లలని కని, చచ్చి పోతడు. అలాగే ఒక మాదిగ పుట్టి,  పెరిగి, మాదిగ బతుకు బతికి, మాదిగ పిల్లలని కని, ముసలి వాడై చచ్చి పోతడు. ఒక కుమ్మరి పుట్టి, పెరిగి, కుమ్మరిలా బతికి, కుమ్మరి పిల్లలని పెట్టి,  ముసలి వాడై చచ్చి పోతడు.

 భూగోళంపైనున్న ఇతర జీవులతో పోల్చి చూస్తే దేహ పరంగా  మానవుడు కూడా ఒక జంతువే.  మానవులు ఇతర జంతువులు వలె,  జన్యువులు, క్రోమోజోములు, ఆర్ఎన్ఎ, కణ నిర్మాణం, (మానవులు జన్యుపరంగా 99.6%  చింపాంజీలుగా ఉంటారు  – కార్ల్ సాగన్, 1992) లక్షణాలు కలిగి,  గాలి, ఆహారం, నీరు వంటి పరిసరాల సమస్యలు వచ్చినప్పుడు, ఇతర జీవుల వలె మరణిస్తారు. కానీ ఆలోచనా పరంగా, మానసికంగా, విస్తృతమైన  ఆలోచన పరిధి తో, మానవులకు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందిన మెదడు కలిగి వుండి  వివేకము, ఆలోచన, అవగాహన, మేధస్సు, భాష  కలిగి, సంఘజీవులుగా భావ వ్యక్తీకరణ, పనిముట్లను వాడుకొని సంఘంలోని ఇతర వారితో సహాయసహకారాలతో పాటు పోటీతత్వంతో ఏ పనినైనా సునాయాసంగా నేర్చుకొని అత్యంత నిపుణతను, నైపుణ్యాన్ని పొందగలడు. కేవలం మనుషులు మాత్రమే ప్రకృతిని చూసి అశ్చర్యాన్ని పొందడం, దైవ భావన గలిగి వుండడం, మంచి, చెడు లాంటి భావాలు కలిగినవారుగా ఉంటారు. 

 అత్యంత ప్రతిభాశాలి అయిన మానవుణ్ణి, చైతన్యం లేని చెట్లు, పక్షులు, పాములు, జంతువుల వలె, ఆలోచన లేని వాడిగా చేసి  చెట్లల్లొ ఆపిల్, జామ, టేకు … లాంటి వర్గాలున్నట్లు, జంతువుల్లో కుక్క, గుర్రం, పిల్లి … లాంటి వర్గాలున్నట్లు ఉన్నట్లు, మొక్కల్లో గులాబి, మల్లె,…  లాంటి వర్గాలు లాంటివి వున్నట్లు …. దానికి వుదాహరణగా, దేహ లక్షణాలు తెలుపు, నలుపు, చామానా చాయ, పొట్టి, పొడుగు శరీరాకృతి కలిగిన మణుషులని చూపిస్తు, మానవుని  ఆలోచన కూడ పుట్టుకతోనె నిర్ణయించబడుతుందని, మనుశుల్లో కూడా బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర, నిశాద …లాంటి  వర్గాలు ఉంటయని అత్యంత ప్రతిభా వంతులైన మన బ్రాహ్మణులు చెప్పారు.

ఆపిల్ గింజలో ఆపిల్ గుణాలు ఉన్నట్లు, కుక్క పిండంలో కుక్క గుణాలు ఉండి, పుట్టుకతో కుక్కలాగ పుట్టినట్లు, బ్రాహ్మణ పిండంలో బ్రాహ్మణ రంగు, బ్రాహ్మణ తెలివితేటలు, బ్రాహ్మణ గుణాలు కలిగి ఉండి పుట్టుకతోనే  బ్రాహ్మణుడిగా, కుమ్మరి పిండంలో కుమ్మరి రంగు, కుమ్మరి తెలివితేటలు, కుమ్మరి గుణాలు కలిగి ఉండి పుట్టుకతోనే  కుమ్మరి వాడిగా, మాదిగ పిండంలో మాదిగ రంగు, మాదిగ తెలివితేటలు, మాదిగ గుణాలు కలిగి ఉండి పుట్టుకతోనే  మాదిగ వాడిగా పుడుతారని, క్షత్రీయ, వైశ్య, శూద్ర, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగ ..  లాంటి రంగు, తెలివితేటలు, గుణాలు కలిగిన మనుశులు ఉంటారని … మానవుని ఆలోచనని నిర్ణయించేది అతను నివసిస్తున్న సమాజం అనేదానికి విరుద్దంగా, మానవులని వర్గీకరించిన గొప్ప శాశ్త్రవేత్తలు మన బ్రాహ్మణ మిత్రులు.   

చెట్లు, జంతువులు, పక్షులు, పాములు వివిద జాతులుగ ప్రకృతిలో వుండడం ఎంత నిజమో మానవులు వివిద వర్ణాలుగా వుండడం అంతే నిజమని, పుట్టుకతోనే వివిద గుణగణాలు కలిగిన ప్రజలు వుంటారని, ఆ గుణాలని మార్చలేమని, ప్రపంచం లోని ప్రతి వస్తువు వివిద వర్గాలుగా విడిపోయి వున్నపుడు, మానవుడు కూడా అందుకు భిన్నంగా ఎందుకు వుంటాడని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందిన మెదడు కలిగి అత్యంత ప్రతిభాశాళి అయిన మానవుణ్ణి ప్రక్రుతిలోని ఆలోచనా జ్ణానం లేని చెట్లు, వివిద జీవజాతులతో పోల్చి, ఒక సత్యాన్ని ఇంకొక అసత్యం తో పోల్చి సారూప్యత ప్రమాణాలను ఆధారంగా వర్గీకరించి, ఇంకొక అర్దసత్యాన్ని శృష్టించి, ఆలోచనకు ప్రాధమికమైన వర్గీకరణతొ నమ్మించి, నర నరాల్లోకి సునాయసంగా వర్ణ వ్యవస్తని ఎక్కించారు.

అత్యంత ప్రతిభాశాళి అయిన మానవుణ్ణి ప్రకృతిలోని జంతూవుల, చెట్ల స్తాయికి దిగజార్చిన బ్రాహ్మణులు, అడవిలోపల పుట్టుకతొ వివిద గుణలని కలిగివున్న, చెట్లు, జంతువులు, పాములు, పక్షులు వున్నట్లు, జంతూవుల్లో కొన్ని శాకాహార జంతువులు వున్నట్లు, జింకలన్ని ఒకే చోట కలసి వున్నట్లు, అడవి పందులన్ని ఒకేచోట కలసి వున్నట్లు, అడవిలో సింహం అన్ని జంతువులను తినుకుంటు ఒంటరిగా బతికినట్లు, జిత్తులతో నక్క బావ బతికినట్లు అడవిలాంటి ఒక గ్రామాన్ని శృష్ఠించి .. దాంట్లో గొల్ల కులం వాళ్ళంత ఒక దగ్గర, వ్రుత్తి కులాల వాళ్ళంత ఇంకొక దగ్గర,  క్షత్రీయ (దొర/సింహం), బ్రాహ్మణ (కరణం/పూజారి), శూద్ర, కమ్మరి, కుమ్మరి, మాల, గొల్ల, చాకలి లాంటి (రంగు) తెలివితేటలు,  గుణాలు కలిగి, తరతరాలు అవే రకం పిల్లలు పెట్టే విదంగా గ్రామాన్ని నిర్మించి ప్రజలకి ఆంక్షలు, నీతి నియమాలు, సంప్రదాయాలు ఏర్పాటు చేసారు.  

ఆపిల్ చెట్టుతో, జామ చెట్టు కలసి కొత్త చెట్టు పుట్టించడం ఎంత అసహజమో, జంతూవుల్లోని కుక్క, గుర్రం కలవడం ఎంత అసహజమో, అలాగే  బ్రాహ్మణ, క్షత్రీయ, శూద్ర, కమ్మరి, కుమ్మరి లాంటి వివిద వర్ణాల ప్రజలు, పెళ్ళి చేసుకోవడం కూడా అంతే అసహజమన్నట్లు ఆంక్షలు, నీతి నియమాలు, సంప్రదాయాలు ఏర్పాటు చేసారు.

ఇక్కడ ఇంకో ముఖ్య విషయం, బ్రాహ్మణ, క్షత్రీయ, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి గుణాలన్ని పురుషులకు తప్ప స్త్రీలకు వర్తించవు. కుమ్మరి కుటుంబం లో పుట్టిన స్త్రీకి, కుండలు చేసే వ్రుత్తి రాదు, అలాగే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీకి,  ప్రపంచాన్ని త్రివర్గాలుగా వర్గీకరించే బ్రాహ్మణ స్లోకాలు రావు.

నేడు ప్రపంచ వ్యాప్తంగా, శిశువుగా జన్మించిన నుండి మనం మానవుడి జీవన శైలిని చూస్తె, మొదట శిశువులుగా (0 నుండి 2 సంవత్సరాల వయస్సు)  అన్నిటికి తల్లిదండ్రులు మీద ఆధారపడి, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని, ప్రజలను గుర్తించుకుంటు, మాట్లాడడం, నడవడం నేర్చుకుంటారు. రెండవ దశలో పిల్లలుగా (3 నుండి 12 సంవత్సరాల వయస్సు) తమంతట తాము ఆహారం తినడం, బట్టలు తొడుగు కోవడం, ఆ తరువాత చదివడం, రాయడం, ప్రపంచంలో బ్రతకడం కోసం కావల్సిన నైపుణ్యాలను నేర్చుకోవడం మొదలు పెట్టి, యువకులుగా (13 నుంచి 18 సంవత్సరాల వయస్సు) స్వతంత్ర అభిరుచుల తో బ్రతకడానికి ఏదో ఒక వృత్తి (ఉదా: కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, అకౌంటింగ్, మర్కెటింగ్, వైద్యం … ) నేర్చుకోని, ఇలా యువకులుగా ఎదో ఒక వ్రుత్తిని ఎన్నుకోవడం చూస్తాం కాని, పుట్టుకతోనే ఎదో ఒక వ్రుత్తి గుణాలతో పుట్టడమనే విషయాన్ని ఎక్కడా వినం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా వృత్తులలో పురోహిత వృత్తి ఒకటి వుంటదని ఎక్కడా వినం.

రెండవ సిద్దాంతం భూగోళం, ప్రకృతి తో పాటు మనుషులు వర్ణాలుగా పుట్టారు: దేవుడు ప్రకృతిలోని చెట్లని, జంతువులని, పాములని, పక్షులని వివిద జాతులుగా,  వర్గాలుగా శృష్ఠించి నట్లు అంతే సహజంగా ఇలా దేవుడు వివిద దేహ లక్షణాలు తెలుపు, నలుపు రంగు, బ్రాహ్మణ, క్షత్రీయ, శూద్ర, అంటరాని తెలివితేటల వర్ణాలుగా మానవులని వర్గీకరించి భూగోళం తో పాటు శృష్టించాడని చెప్పారు.

ఈ సృష్టితో పాటు పవిత్రమైన సమయంలో, పరిపూర్ణతతో  దైవాజ్ఞ ప్రకారం ఇలా మానవులు వివిద వర్ణాలుగా శృష్టించబడ్డారు కాబట్టి, వర్ణ దర్మాన్ని వ్యతిరేకించడం దైవాన్ని వ్యతిరేకించడం తో సమానం అని చెప్పారు.

మానవ జాతి శృష్ఠి క్రమాన్ని,   నాగరికత మూలాలను  మనం ఒక్కసారి పరిశీలిస్తే, చింపాజి నుండి మానవుడిగా మారిన క్రమం, జంతూవులని వేటాడుతూ బ్రతికిన క్రమం, పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, పెంపుడు జంతువులను, మొక్కలను పెట్టుకొని, వ్యవసాయం నేర్చుకొని మొదట గూడెం, తరవాత గ్రామం, తరవాత పట్టణం, తరవాత నగరం నిర్మించుకొని జీవిస్తున్న క్రమం మనకు అర్దం అవుతుంది.

ఇక మూడవ సిద్దాంతం రెండవ జన్మ, పూర్వ జన్మ సుకృతం: అంతే కాకుండా బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్గాలు రెండవ సారి జన్మించిన వారిగా, వారు పూర్వ జన్మలో వారి వర్ణ దర్మాన్ని సంపూర్తిగా పాటించడం వల్ల, ఈ జన్మలో వీరు  బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్గాలుగా జన్మించారని, ఈ జన్మలో శూద్ర, అంటరానివారు వారి వర్ణ దర్మం, నోరుమెదపకుండా ఆర్యులకి సేవ చేసే  దర్మం పాటిస్తే, వచ్చే జన్మలో  బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్గాలలో ఒకరిగా పుడతారని, లేకుంటే హీనమైన జంతువులుగా, కుక్కలుగా పుడతారని కనిపెట్టారు.

అసలు దేవుడు పగపడతాడా? ఒక జన్మలో వర్ణ దర్మాన్ని పాటించకుండా ఉంటె, అంటే బ్రాహ్మణ, క్షత్రీయులకి సేవచేయకుండా ఉంటే, పగ బట్టి, ముందటి జన్మలో వేరొక మనిషికి బానిసగా పుట్టిస్తాడా? మెదడు, చెవులు లేని నాగేంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు పగపడితే, ఈ బ్రహ్మ దేవుడు తరతరాలు పగపట్టడం దేవుడనే భావనకే విరుద్దం. అసలు దేవుడు ఉన్నదే పాపులని క్షమించడానికి. బానిసత్వాన్ని పెంపొందించడానికి కాదు. ముఖ్యంగా మొత్తం విశ్వం యొక్క సృష్టికర్త, రక్షకుడు, సర్వజ్ఞుడు అయిన దేవుడు ప్రజలు శరణు కోరిందే తడువుగా వారికి కావల్సిన శక్తిని, వారి  సమస్యలు తీర్చడానికి వర్తమానంలో వున్నటువంటి దోషరహితుడైన దేవుడు 90% ప్రజలు బానిసత్వ తరగతి శూద్రులు, అంటరానివారు ఉండాలని కోరుకోడు.  ఎల్లప్పుడు పేదవాణ్ణి, బాదల్లో  వున్నవారిని ఆదుకోవడానికే దేవుడు వుంటాడు. అలాంటిది ఈ జన్మంత నోర్మూసుకోని అర్యులైన బ్రాహ్మణ, క్షత్రీయులకు సేవచేసే బానిస దర్మాన్ని కచ్చితంగా పాటిస్తే వచ్చే జన్మలో నీకు తిండి, బట్ట, ఇల్లు దొరుకుతది, ఈ జన్మకు నీ జీవితం ఇంతే అని, దేవుణ్ణి అడ్డం పెట్టుకోని చెప్పడం, దేవుడనే భావనకే విరుద్దం. అంటె తొంబై శాతంగా వున్న శూద్ర, అంటరాని వారిలో ఎవరికైనా ఆలోచన వచ్చి, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య లాగా వారి హక్కులు, వారికి కూడా తిండి, బట్ట, ఇల్లు కావాలని అడిగితే, వారి నోరు మూయించడానికి కనిపెట్టిన  సిద్దాంతం లా మనకు అర్దం అవుతుంది. 

స్కూలుకు పోతున్న ఇంట్లో సరైన సదుపాయలు, ప్రోత్సాహం లేని, సామాజికంగా  అనిచివేత, తక్కువ వాల్లం అనే భావన వున్న  శూద్ర , అంటరాని వారి పిల్లలు, అన్ని అవకాశాలు వున్న బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య పిల్లల జీవన శైలిని పరిశీలిస్తె, స్కూలు తరువాత శూద్ర, అంటరాని పిల్లలు తల్లి తండ్రులకు వారి వృత్తిలో సహాయంగా ఉండడం చూస్తాం, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యుల పిల్లలు వేద పఠనం చేయడం చూస్తాం. వేద పఠనం  ద్వారా ఈ పిల్లలకు, వర్గీకరణ జ్ణానంతో ప్రపంచంలో “బ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, రెడ్డి, కమ్మ, మాల, మాదిగ” లాంటి తెలివి తేటలున్న “బుర్ర” లు ఉంటాయని నమ్మడమే కాకుండా, భూమి బ్రాహ్మణుడని, వాతవరణం క్షత్రీయుడని, ఆకాశం వైశ్యుడని,  ఏడు సముద్రాలల్లో పాల సముద్రం మీద క్షత్రీయ దేవుడు విష్ణు పవళిస్తాడని నమ్ముతారు.

ఈ వర్ణ వ్యవస్త బ్రాహ్మణులు,  సి.డి తో కంప్యూటర్లో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసినట్లు మంత్రంతో వర్ణ గుణాలను బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యులకు చొప్పించడానికి, వడుగు అనే కార్యక్రమాన్ని కనిపెట్టి, ఎనిమిది పదాల గాయత్రి మంత్రంతో బ్రాహ్మణ గుణాలని ఎనిమిదేళ్ళ బ్రాహ్మణ పిల్లవాడికి,  పదకొండు పదాల త్రిస్తుబ్ మంత్రంతో క్షత్రీయ గుణాలని పదకొండేళ్ళ క్షత్రీయ పిల్లవాడికి, పన్నెండు పదాల జగతి మంత్రంతో వైశ్య గుణాలను పన్నెండేళ్ళ వైశ్య పిల్లవాడికి, ఇలా వివిద గుణాలను వీరి మెదడుల్లో చొప్పించవచ్చు అని నమ్ముతారు.  ఈ వర్గీకరణను వివరించే మూడు వేదాలు, లేదా “త్రి జ్ఞానం,” సత్య సమానంగా నిర్ధారించబడినదని”, వేద విజ్ఞానమే మనవుని జ్ఞానానికి మొదలు, మరియు చివర అని, ఇదె  ఇదే సార్వత్రిక సూత్రం అని, “నిజం” అని, మిగితా సైన్స్,  మానవ జ్ఞానం  ధూళి కంటే వ్యర్దమైనదని నమ్ముతారు. వేదాలు, బ్రాహ్మణులు ఒకటే అని, వాక్ “వేదాల తల్లి” అని  వేదాలు మరియు వర్ణాలు భూగోళంతో పాటు సృష్టించబడ్డాయి అని నమ్ముతారు

ఒక వైపు బడిలో సోషల్ మాస్టారు, భూమి గోళం అని, అది సూర్యుని చుట్టు తిరుగుతుందని, ఇంకా ఏడు సముద్రాలు “హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రం …” ఇలా చెప్పుతారు. ఇలా రెండు రకాల చదువులతొటి, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్యుల పిల్లలు అయోమయంతో “బట్టి” పట్టే జ్ణానం తప్ప, నిజమైన విద్య; పరిసరాలను, ప్రపంచాన్ని బాగుచేయడానికి కావల్సిన సృజనాత్మకత కలిగిన, కొత్త వస్తువులను కనిపెట్టే, మానవ జీవితాన్ని సులభతరం చేసే ప్రతిభ వీరిలో ఉండడానికి అవకాశంలేదు.

వేద పఠనం లేకుండా, కేవలం బడిలో  మాస్టారు చెప్పే విషయాన్ని మాత్రమే చదివే శూద్ర , అంటరాని వారి పిల్లలకు సరైన ప్రోత్సాహం, అర్దిక వెసులుబాటు, సామాజికంగా ఆత్మ విశ్వాసాన్నిప్రోది చేసే సంస్కృతిని అందిస్తే, ఈ 90% వున్న శూద్ర , అంటరానివారు అత్యంత ప్రతిభా వంతులుగా అంటే బట్టి పట్టి మార్కులు సంపాదించే ప్రతిభ కాకుండా, కొత్త వస్తువులను కనిపెట్టే సృజనాత్మకత ప్రతిభతో ఇండియాలోని ప్రతీ గ్రామాన్ని టెక్నాలజీ పార్క్ చేసి, ప్రపంచంలోనే వున్నతమైన దేశంగా నిలబెడతరు.

 

Related Articles:

Jyotiba Phule - The lower castes are aboriginal people
Origin of Brahmin
Roots of Caste System
Tripartite Varna System - Slokas
Upanayana or Vodugu

comment closed

Copyright © 2026 · Indus Heritage Center · All Rights Reserved