వేదాలు – వర్గీకరణ
ఈ పుస్తకం కుల వ్యవస్త మూలాలని కనుక్కోవడానికి, జ్ఞానాన్వేషణ పేరుతో పురాతన బ్రాహ్మణులు వేదాలుగా వ్రాసిన శ్లొకాల ద్వారా సమాజాన్ని వర్గీకరించిన పద్దతిని వివరించడానికి ప్రయత్నం చేస్తుంది. మానవుల వర్గికరణ సహజమైనవదిగా, న్యాయమైనవదిగా, సక్రమమైనదిగా చూపించడానికి వారు అనుసరించిన వివిద పద్దతులను వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ వేదాలను క్రీస్తుకు పూర్వం 1100 సం.లొ రుగ్వేదాన్ని కంపోజ్ చేసినట్లు, క్రీస్తుకు పూర్వం 300 సం లొ సంస్కృత భాషలొని స్లొకాలని దేవనగరి లిపిలొ వ్రాసినట్లు ఇండాలజిస్తులు నిర్డారించారు.
వర్ణ అంటే స్వాభావికంగా “రంగు” అని అర్దం. ఈ పుస్తకం లో ఈ పదం “వర్గం” గా ఉపగించబడింది. ఎందుకంటే ఈ వర్ణ అనే పదం, వేదాలల్లో అప్పటి సమాజంలో భాగంగా వున్న ఆర్య, దాస్యు, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర (సేవక తరగతి) ప్రజలను ఉద్దేశించి వుపయోగింపబడింది. ఆలోచనకు, తర్కానికి (లాజిక్), కారణం వివరించడానికి (రీజనింగ్) మూలాదారం అయిన వర్గీకరణ వ్యవస్థ (Categorization System) ని వుపయోగించి, అనునయ పూర్వకమైన ఒప్పించే కథల ద్వారా, విశ్వం అంతా వర్ణాలుగా విడిపోయి వున్నది అని చెప్పుతూ మానవుల వర్గీకరణను విశ్వ వ్యాప్తం చేయడం ద్వారా మానవుల వర్గికరణ, సమాజం లోని హెచ్చు, తగ్గులని సమర్దించుకోవడానికి వేదాలను కూర్చిన బ్రాహ్మణులు ఉపయోగించిన పద్దతి గురించి వివరిస్తుంది.
వర్గీకరణ:
ఆలోచనకు, తర్కానికి (లాజిక్), కారణం వివరించడానికి (రీజనింగ్) మూలాదారం వర్గీకరణ (Categorization). అసలు ఆలోచించడం అంటేనే వర్గీకరణ, క్రమీకరించడం, పోల్చుకోవడం. వర్గీకరణ లేకుండా నోటితో కనీసం ఒక పది పదాలను పలకలేము. మానవులం అయిన మనం తీసుకొనే నిర్ణయాలను అత్యంత ప్రభావితం చేసేది మెదడు యొక్క వర్గీకరించే లక్షణం. వర్గీకరణ అనేది ప్రకృతిని, సమాజాన్ని, వస్తూవులను, సంఘటనలను వర్గీకరించి వివిద కేటగిరీలుగా నిర్మించడానికి మెదడులో జరిగే ముఖ్యమైన మానసిక ప్రక్రియ. ఈ ప్రక్రియ బాహ్య ప్రపంచం గురించి మన పరిజ్ఞానం నిర్మాణం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మన ఆలోచనలకు అనుభూతికి, పనిచేయడానికి, మాట్లాడటానికి వర్గీకరణ కంటే మించిన ప్రాథమికమైనది ఏమీ లేదు.
మనం దేన్నైనా చూస్తున్నాము అంటేనే, ఒక రకమైన వాటిని చూస్తున్నాము అని, ఉదా: చెట్టు మనం వర్గీకరించినం. అలాగే మనం దేని గురించి అయినా కారణం వివరించాలంటే ఉదా: దేశాలు, భావోద్వేగాలు, కుర్చీలు, అనారోగ్యం, ఇలా ప్రపంచములో ఎలాంటిదాని గురించి అయినా, వివరించాలంటే వాటిని వర్గీకరించి వివిద కేటగిరిలుగా నిర్మించడం చూస్తాం. మనం ఏదైనా చేస్తున్నాము అంటే, ఉదా: వ్రాస్తున్నా, తింటున్నా, ఆడుతున్నా, దున్నుతున్నా … ఇక్కడ కూడా కేటగిరీలు వాడుతున్నం. మనకి ఈ వర్గీకరణ సామర్థ్యం లేకుంటే, ఈ భౌతిక ప్రపంచం లో గాని మన సామాజిక లేదా మేదో జీవితాల్లో మానవులుగా బతకడం అసాద్యం.
దీనికి విరుద్ధంగా, ప్రపంచలోని విషయాలను వివిద తరగతులుగా లేదా వర్గాలుగా లేదా విభాగాలుగా విభజించకుండా చూస్తే పూర్తిగా అస్తవ్యస్తమై, ఏ విషయం అర్దం కాకుండా పోతుంది. ఏదైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని వివిద తరగతులుగా లేదా వర్గాలుగా లేదా విభాగాలుగా విభజించి నిర్మాణం చేయడం ద్వారా వాటిని నిర్వహించడం తేలిక అవుతుంది. అందుకే వర్గీకరణ అనేది మానవుని ఆలోచనకు కేంద్ర భిందువు మాత్రమే కాదు, ప్రాదమికమైన ఆలోచించే శక్తిని ప్రసాదించే అత్యంత ఆవశ్యకమైనది.
మానవుడు భాష నేర్చుకున్న దగ్గరనుండి, పరిణామ క్రమంలో తన చుట్టూ వున్న ప్రక్రుతిని, తను కనిపెట్టిన వస్తూవులను, విషయాలను, సమాజాన్ని వర్గీకరించి వాటిని వివిద కేటగిరీలుగా నిర్మించాడు. కేటగిరి అంటే స్థల, కాలాలతో, సందర్భంతో సంభందం లేకుండా మానవుడు కనుక్కొని నిర్మించిన విషయాలు. ఆంటే భయట ప్రపంచాన్ని ప్రతిభింభించే విదముగ, మన తలలో ఆలోచనలుగా నిజంగా వున్న విషయాలు. ఉదాహరణకి, కుక్క కేటగిరి గురించి నా ఆలోచనలు, నా మానసిక అనుభూతి ఎలా ఉంటుందో, భాష ఎమైనప్పటికి బ్రెజిల్ లో వున్న వ్యక్తికి, జర్మనీలో వున్న వ్యక్తికి, సొమాలియాలో వున్న వ్యక్తికి ఒకేరకమైన మానసిక అనుభూతి వుంటుంది. అలాగే చెట్టు, ఆవు, సూర్యుడు, చంద్రుడు, వెలుగు, చీకటి, గుర్రం, పక్షి .. అలాగే మానవుడు కనిపెట్టి తయారు చేసిన కంప్యూటర్, పెన్, కారు, సైకిల్, తలుపు, నాగలి, ఇల్లు లాంటి వస్తు కేటగిరీలు, తీపి, చేదు, కారం, నవ్వు, ఏడుపు, కన్నీళ్ళు, భాద లాంటి అనుభూతి కేటగిరీలు, పేదవాడు, వున్నవాడు, మద్య తరగతి, కుంటివాడు, గుడ్డివాడు లాంటి మనుషుల కేటగిరీలు గురించి నా ఆలోచనలు, నా మానసిక అనుభూతి ఎలా ఉంటుందో, భాష ఎమైనప్పటికి ప్రపంచములో ఉన్న ఎదుటివారి ఆలోచనలు అలాగే వుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో వున్న చాలా సమాజాలల్లో కుక్క అనే జంతువు వుంది, దానికి వారిపుర్వికులు కనిపెట్టిన భాషలో దానికి పేరు పెట్టారు. అలాగే చెట్టు అని మనం అంటే, యూరప్ లో వున్న ఇంగ్లీషు వాళ్ళు ట్రీ అంటారు.
ఇలా ప్రతీ సమాజంలో కొత్త విషయాలని, కొత్త వస్తూవులను, కొత్త జంతూవులను కనిపెట్టి నప్పుడు వాటికి పేరుపెట్టి వాటిని వర్గీకరించి వివిద కేటగిరీలుగా నిర్మించి, వాటికి మిగితా కేటగిరీల తో గల సంభందం వివరించి తమ కింది తరాల వాళ్ళకు అందిస్తారు. అయితే ఒక తరం కనిపెట్టిన విషయాలను, వస్తూవులను మరోతరం మరింత విస్తృత పరచి కొత్త కేటగిరిలను కనిపెట్టి మరో తరానికి అందజేస్తుంది. చెట్టు కేటగిరీలో జామ, ఆపిల్, టేకు, మద్ది, రావి, మందారం .. లాంటివి, జంతూవుల్లో కుక్క, నక్క, సింహం, పులి, ఆవు, బర్రె … ఇలా ఎన్నో జంతూవులని కనిపెట్టడం చుడవచ్చు. ఉదాహరణకి యూరప్ లో మొదటి తరం వారు పారిశ్రామిక విప్లవం ద్వార కనిపెట్టిన వాటిలో కార్ కేటగిరి ని, తరువాత తరంవారు మరింత విస్తృత పరచి కార్ కేటగిరీలో ఎన్నో రకాల కార్లను కనిపెట్టిన విశయాన్ని మనం చూడవచ్చు.
నూతన ఆవిష్కరణలు (Innovations in India)
మన ఇండియాలో కూడా మన పూర్వికులు, కుక్క, నక్క, చెట్టు, పాము, నాగలి, సూర్యుడు, చంద్రుడు లాంటి ప్రపంచం లోని అన్ని సమాజాలల్లో వున్న వారు కనిపెట్టిన కేటగిరీల తో పాటు, మరి ఏ సమాజం లో లేని మరికొన్ని కేటగిరీలను కని పెట్టారు. వీరు కనిపెట్టిన కేటగిరీలకు ప్రపంచం లోని మరి ఏ ఇతర సమాజం లో కూడా వారి భాషలో సరి సమానమైన కేటగిరీలు కనపడవు. ఆ కనిపెట్టిన కొత్త విషయాలు కారో, విమానమో, గడియారమో, పలకో, బలపమో, మరొకటో కాదు. ఆరోగ్యకరమైన మనుషుల్లో కూడా వివిద గుణాలు కలిగిన మనుషులు వుంటారని కనిపెట్టి మనుషులను వర్గీ(వర్ణీ)కరించి, వివిద కేటగిరీలుగ నిర్మాణం చేసారు.
రుగ్వేదం సమయంలోని పూర్వికులు, మనుషుల్లో ఆర్యులు మరియు దాస్యులనే కేటగిరీలను (వర్ణాలు) కనిపెడితే (RV, 1.103.3, 1.117.21, 6.25.2.3, 6.60.6, 7.83.1, 10.38.3, 10.86.19, 10.102.3, 10.83.1), తరువాత తరంవారు అదర్వ వేదం సమయానికి; మనుషులను వర్గీకరించే ప్రక్రియని మరింత విస్తృత పరచి ఆర్యుల కేటగిరీని విడదీసి బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య కేటగిరిలు(వర్ణాలు)గా , దాస్యులని శూద్ర కేటగిరి (వర్ణాలు) కింద వర్గీకరించడం మనం చూడవచ్చు(Purusha sukta RV 10.90.11-12 also found in the Vajasaneyi samhita of the white Yajur-Veda (31.1-16) and in the Atharva-Veda (19.6.1) ). తరువాత తరంవారు బ్రాహ్మణాలు (సతపత బ్రాహ్మణ, ఐతారేయ బ్రాహ్మణా ….) వ్రాసే సమయానికి, ఈ వర్గీకరించే ప్రక్రియని మరింత విస్తృత పరచి ఈ ఆర్యుల్లోని బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య కేటగిరీలు మనుషుల్లోనే కాదు, జంతూవుల్లో, చెట్లల్లో, దేవుళ్ళల్లో, పక్షుల్లో, ప్రపంచంలోని అన్నింటిలో వుంటాయని కనిపెట్టినట్లు వారు కూర్చిన స్లోకాల ద్వారా అర్దం అవుతుంది.
మానవ సమాజాన్ని ఇలా వివిద కేటగిరీలుగా వర్గీకరించడం ప్రపంచంలోని మరి ఏ ఇతర సమాజంలో కనపడదు. ఎరుపు అని తెలుగు సమాజం లోని కేటగిరికి రెడ్ అని ఇంగ్లీషు సమాజంలో సరి సమానమైన కేటగిరి వుంటుంది. కాని బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర అనే కేటగిరీకి మరి ఏ ఇతర సమాజాలల్లో సమానమైన కేటగిరి మనకు కనపడదు. వీరు కనిపెట్టిన కొన్ని కేటగిరీలకు ఇతర సమాజాలల్లోని ప్రజల భాషలో కేటగిరి దొరికినా, ఆ కేటగిరీల అర్దం, నిర్మాణం, దానికి వివిద కేటగిరీలతో సంభందంలొ చాలా తేడా వుంటుంది.
యూరప్ లో సైంటిస్టులు కార్ల కంపెని లో కార్లు తయారు చేసినట్లు, తర తరాలు ఒకేరకమైన శూద్రులని తయారు చేయడానికి, కౌటిల్యుని కాలనికి “వంద కుటుంబాలకి తక్కువ కాకుండా, ఐదు వందల కుటుంబాలకు ఎక్కువ కాకుండా, మొత్తం శూద్ర కులస్తులతో గ్రామాన్ని నిర్మించినట్లు కౌటిల్యుని అర్దశాస్త్రం (2.1)లో చూడవచ్చు. తర తరాలు ఈ గ్రామాల్లోని శూద్రులు, శూద్ర పిల్లలను మాత్రమె పెట్టే విదంగా, తమ గ్రామానికి చెందిన వారినిగాని, మరో గ్రామానికి చెందిన శూద్ర వర్ణం వదువునే పెళ్ళి చేసుకొనే విదంగా ఆంక్షలు విదించారు. ఇదే కాలంలో తమ మీద తిరుగుబాటు చేసిన శూద్రులని, అదే గ్రామం బయట “వెలి” వేసిన ప్రజలుకూడ వున్నట్లు, మనకి అర్దశాశ్త్రంలో చూడవచ్చు.
మనుశాస్త్ర రచయిత పుశ్యామిత్ర కాలానికి, మనుషులని వర్గీకరించే ప్రక్రియని మరింత విశ్త్రుత పరచి, కౌటిల్యుని కాలం లో శూద్ర వర్ణం ప్రజలతొ నిర్మితమైన గ్రామం లోని శూద్ర వర్ణం ప్రజలని మరి కొన్ని భాగాలుగా విడగొట్టినట్లు మను స్మృతి, విష్ణు స్మృతి లోని స్లోకాల ద్వార అర్దం అవుతుంది. వీరి వర్గీ(వర్ణి)కరణను వ్యతిరేకించిన ప్రజలను లొంగదీసుకోవడానికి, భయంకరమైన “వెలివేత” అనే సాదన్ని ఉపయొగించినట్లు కూడా మను స్మృతిలో చూడవచ్చు.
తరువాత కాలంలోని బ్రాహ్మణులు, వారి ఆదిపత్యాన్ని సిందు ప్రాంతం (ఉత్తర భారతదేశం) నుండి, దక్షణ, తూర్పు భారతదేశం కి విస్తరించేక్రమంలో కొత్తగా వచ్చిన జాతులను కలుపుకొనే క్రమంలో, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శుద్ర, వర్ణసంకర వర్ణాలు నిశాద, అంభస్ట, సూత, కరణ, ఉగ్ర, వైదేహక, చండాల, కారవార, సోపక, మాదుగుల వంటి వర్ణాలను మరికొన్ని వర్గాలుగ వర్గీకరించినట్లు మనుదర్మ శాశ్త్రం లో చూడవచ్చు. ఈ విస్తరణలో భాగంగా ఏర్పడ్డవె ప్రస్తుత 800 కు పైగా వున్న బ్రాహ్మణ ఉపకులాలు., మరికొన్ని తరాల తరువాత శంకరాచార్యుడు కాలంలో మనుషుల వర్గీకరణని మరింత విస్తృత పరచి, గ్రామం లోని ప్రజలని “వృత్తి” ఆదారంగా విడగొట్టి నట్లు అర్దం అవుతుంది. తరువాత కాలం లో గ్రామం లోని కొన్ని వర్ణాల ప్రజలని గుణం ఆదారంగా కూడా వర్గీకరించి వెలివేసి నట్లు తెలుస్తుంది.
యూరప్ లో పారిశ్రామిక విప్లవానికి మూలమైన ఐనిస్టిన్ లాంటి సైంటిస్టులని గొప్ప మేదావులుగా, పండితులుగా; వారు వ్రాసిన పుస్తకాలని గొప్ప సైద్దాంతిక పుస్తకాలుగా పరిగనించినట్లు, మానవుల వర్గీకరణ సిద్దాంతం (వేదాలు) పుస్తకాలను గొప్ప సైద్దాంతిక పుస్తకాలుగా, సత్యం తో సమానంగా పరిగణంచి, ఈ సిద్దాంతాన్ని విస్తృత పరచిన వాళ్ళను గొప్ప మేదావులుగా, పండితులుగా పరిగణించారు.
ఈ వర్గీకరణ సిద్దాంతం విస్తృత పరచడానికి బ్రాహ్మణుల కోసం ప్రత్యేక శాఖలు (పాఠశాలలు) ఏర్పరచినట్లు చూడవచ్చు. యోగ సూత్రాల సంగ్రహకుడు పతంజలి యొక్క మహాభాస్య పుస్తకం ప్రకారం, రుగ్వేదం సమయం లో 21 శాఖలు, అదర్వవేద సమయం లో 9, యజుర్వేద సమయం లో 101 (కృష్ణ యజుర్వేదం యొక్క 86 మరియు శుక్ల యజుర్వేదం 15) మరియు సామవేదం పఠించడం కోసం 1000 శాఖలు ఉన్నాయి.
మన ప్రస్తుత యూనివర్సిటీల్లోని విద్యార్దులు సెమినార్లు, చర్చలు, రీసర్చులు చేసి కొత్త వస్తూవులను కనిపెట్టినట్లు … ఈ గురుకుల పాఠశాలల్లోని (శాఖలు) బ్రాహ్మణ విద్యార్దులు, ఈ మానవుల వర్గికరణ మీద ఎన్నో చర్చలు, రీసర్చ్లు చేసి మానవుల్లో కొత్త వర్గాన్ని కనిపెట్టి, కనిపెట్టబడ్డ కొత్త మానవ వర్గం లక్షనాలు, వారు చేయాల్సిన కార్యక్రమాలు నిర్ణయించి, రాజు ద్వారా అన్ని గ్రామాల్లో కొత్తగ కనిపెట్టబడ్డ వర్గ మానవుణ్ణి నిర్మించి, తర తరాలు అదే రకం పిల్లలను మాత్రమె పెట్టే విదంగా, తమ గ్రామానికి చెందిన వారినిగాని, మరో గ్రామానికి చెందిన అదే వర్ణం (వర్గం) వదువునే పెళ్ళి చేసుకొనే విదంగా ఆంక్షలు, ఆచారాలు నిర్ణయించారు.
మొత్తంగా నేటి కుల వ్యవస్తకు మూలం బ్రాహ్మణ వర్ణం పుట్టుక, “మనుశులను వర్గీ (వర్ణీ) కరించే” సిద్దాంత ఆవిర్భావం, వర్గీకరణ సిద్దాంతాన్ని విశృత పరచడానికి బ్రాహ్మణుల కోసం ప్రత్యేక శాఖాల (పాఠశాల)ల ఆవిర్భావం, మరియు “వెలివేత” సిద్దాతం గా మనకు అర్దం అవుతుంది.
వర్గీ కరణ – రుగ్వేదం
ఋగ్వేదం లో మొత్తం 1028 శ్లోకాలతో పది (మండలాలు) పుస్తకాలు వున్నాయి. 2 నుండి 7 పుస్తకాలను అత్యంత పురాతన వాటిగా పరిగణిస్తారు; వాటిని ‘కుటుంబం పుస్తకాలు’ అని కూడా అంటారు ఎందుకంటే వాటిని కొన్ని కుటుంబాలు (ఋషులు) కూర్చినట్లుగా భావిస్తారు. రుగ్వేదం లోని 10 మండలాలని 10 కుటుంబాలకు చెందిన 21 మహిళా భ్రాహ్మణులతో కలిపి 407 మంది మొత్తం బ్రాహ్మణులు (ఋషులు) 21 శాఖ లల్లో కూర్చినట్లు, ప్రతీ మండలంలో ఈ కుటుంబం కోసం “అప్రి సూక్త” పేరుతో ఒక స్లోకం ఉంటుంది. మండలం 2 గ్ర్త్సమదస్ వంశం, మండలం 3 విస్వామిత్ర వంశం, మండలం 4 వామదేవ వంశం, మండలం 5 ఆత్రిస్ వంశం మండలం 6 భరద్వాజ వంశం, మండలం 7 వశిస్ట వంశం, మండలం 8 కాన్వస్ వంశం, మండలం 9 కశ్యప వంశం కూర్చినట్లుగా ప్రస్తుత బ్రాహ్మణులు చెప్పుకుంటారు.
1 మరియు 10 వ పుస్తకాలను తరువాతి దశలో కూర్చారు. బుక్ 10 లోనే (10.90.11-12), చతుర్వర్ణ వ్యవస్తకు సాక్ష్యంగా పురుష సూక్త “పురుష ముఖం బ్రహ్మిణుడు, భుజాలు క్షత్రీయ, తొడలు వైశ్య, పాదం శూద్రులు” వుంటుంది, (ఇప్పటి విష్ణు దేవుడు లాగ, అప్పటి గొప్ప దేవుడు పురుష) ఈ రెండు పుస్తకాలు 100 BCEలో బ్రాహ్మణాలు కూర్చే కాలంలో కూర్చినట్లు భావిస్తారు. పుస్తకాలు 2 నుండి 7 లో శ్లోకాలు ఆర్యుల వలస కాలము 1100 BCE యొక్క పాత సంప్రదాయాలు, వారి మూలాలను కలిగి వున్న శ్లోకాలు, దాస్య వర్ణం ప్రజలతో ఆర్య వర్ణం చేసిన యుద్దానికి సంభందించిన స్లోకాలు వుంటాయి.
comment closed